ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Crime - Aug 03, 2020 , 15:57:48

రాఖీ పండుగ వేళ విషాదం.. అన్నాచెల్లెలు మృతి

రాఖీ పండుగ వేళ విషాదం.. అన్నాచెల్లెలు మృతి

వనపర్తి : చిన్నంబావి మండలం లక్ష్మీపల్లి స్టేజీ వద్ద ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. రాఖీ పండుగ వేళ రోడ్డుప్రమాదంలో అన్నాచెల్లెలు మృతి చెందారు. బైక్‌పై వెళ్తున్న వీరిని కొల్లాపూర్‌ డిపో బస్సు ఢీకొట్టింది. దీంతో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదంలో మరొకరికి తీవ్ర గాయాలవడంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

మృతులను వీపనగండ్ల మండలం తూముకుంట గ్రామానికి చెందిన నందిని, దామోదర్‌గా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పెద్దదగడ గ్రామానికి రాఖీ కట్టడానికి వెళ్లి.. తిరిగి స్వగ్రామం వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు.మృతుల నివాసాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.


logo