శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Crime - Jul 28, 2020 , 17:06:35

రోడ్డు ప్రమాదంలో అన్నాచెల్లెళ్లు మృతి

రోడ్డు ప్రమాదంలో అన్నాచెల్లెళ్లు మృతి

షామ్లీ : రోడ్డు ప్రమాదంలో అన్నాచెల్లెళ్లు మృతి చెందిన సంఘటన ఉత్తరప్రదేశ్‌ రాష్ర్టం షామ్లీ జిల్లాలో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. షామ్లీ జిల్లా కంధ్లా ప్రాంతానికి చెందిన కామిల్‌(27) తన సోదరి పర్విన్‌ (25)తో కలిసి వ్యక్తిగత పని నిమిత్తం ద్విచక్రవాహనంపై బయల్దేరారు. ప్రధాన రహదారిపై వెళ్తుండగా ఎదురుగా అతి వేగంగా వస్తున్నకారు వీరిని ఢీకొట్టింది. ఈ ఘటనలో అన్నాచెలెళ్లు అక్కడికక్కడే మృతి చెందగా.. కారు డ్రైవర్‌ పరారయ్యాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు కంధ్లా పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ కర్మవీర్ సింగ్ తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo