ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Crime - Aug 21, 2020 , 13:21:40

బాలుడిని లైంగికంగా వేధించిన బ్రిటీష్ జాతీయుడు అరెస్ట్

బాలుడిని లైంగికంగా వేధించిన బ్రిటీష్ జాతీయుడు అరెస్ట్

భువనేశ్వర్: వసతి గృహంలోని ఒక బాలుడిని లైంగికంగా వేధించిన బ్రిటీష్ జాతీయుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. బ్రిటన్‌కు చెందిన జాన్ పాట్రిక్ బ్రిడ్జ్ అనే వ్యక్తి ఒడిశాలోని జార్సుగుడాలో ఓ వసతి గృహాన్ని నిర్వహిస్తున్నాడు. అయితే అందులోని ఒక మైనర్ బాలుడిపై ఆయన లైంగికదాడికి పాల్పడినట్లు ఆరోపణలొచ్చాయి. ఫిర్యాదు అందుకున్న పోలీసులు గురువారం ఆ వసతి గృహానికి చేరుకున్నారు. నిర్వాహకుడైన బ్రిటీష్ జాతీయుడు జాన్ పాట్రిక్ బ్రిడ్జ్‌ని అరెస్ట్ చేశారు. నిందితుడ్ని కోర్టుకు అప్పగించినట్లు ఎస్పీ రాహుల్ తెలిపారు. బాలుడిపై జరిగిన లైంగిక దాడి కేసుపై దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన చెప్పారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo