సోమవారం 03 ఆగస్టు 2020
Crime - Jul 06, 2020 , 16:58:43

కొద్ది గంట‌ల్లో పెళ్లి.. బ్యూటీపార్ల‌ర్ లో వ‌ధువు హ‌త్య‌

కొద్ది గంట‌ల్లో పెళ్లి.. బ్యూటీపార్ల‌ర్ లో వ‌ధువు హ‌త్య‌

భోపాల్ : కొద్ది గంట‌ల్లో ఆమె పెళ్లి పీట‌లెక్క‌బోతోంది. అందంగా ముస్తాబు అయ్యేందుకు బ్యూటీపార్ల‌ర్ కు వ‌చ్చింది. ఆ న‌వ వ‌ధువు బ్యూటీపార్ల‌ర్ లోనే దారుణ హ‌త్య‌కు గురైంది. ఈ దారుణ ఘ‌ట‌న మ‌ధ్య‌ప్ర‌దేశ్ రాట్లం జిల్లాలోని జోరా ప‌ట్ట‌ణంలో ఆదివారం చోటు చేసుకోగా ఆల‌స్యంగా వెలుగు చూసింది. 

సోను యాద‌వ్ అనే యువ‌తికి మూడేళ్ల క్రితం ఓ ఫంక్ష‌న్ లో రాము యాద‌వ్ ప‌రిచ‌య‌మ‌య్యాడు. ఈ ప‌రిచ‌యం కాస్త ప్రేమ‌కు దారి తీసింది. గ‌త మూడేళ్ల నుంచి వీరిద్ద‌రూ ప్రేమించుకుంటున్నారు. కొద్ది కాలం క్రితం వీరిద్ద‌రూ విడిపోయారు. అయితే ఇటీవ‌లే సోనుకు వేరొక‌రితో పెళ్లి కుదిరింది. విష‌యం తెలుసుకున్న రాము ఆగ్ర‌హంతో ఊగిపోయాడు. ఎలాగైనా సోనును చంపాల‌ని నిర్ణ‌యించుకున్న రాము.. ఇందుకు త‌న ఫ్రెండ్ పంచ‌ల్ స‌హాయం తీసుకున్నాడు. 

ఇక సోను త‌న బంధువుతో క‌లిసి ఆదివారం ఉద‌యం జోరా ప‌ట్ట‌ణంలోని ఓ బ్యూటీ పార్ల‌ర్ లోకి మేకప్ కోసం వెళ్లింది. ఇదే స‌మ‌యంలో సోనుకు రాము ఫోన్ చేశాడు. కానీ ఆమె నుంచి స‌మాధానం రాలేదు. దీంతో పంచ‌ల్ ఫోన్ తీసుకుని సోనుకు కాల్ క‌లిపాడు. గుర్తు తెలియ‌ని నంబ‌ర్ అని భావించిన సోను ఫోన్ లిఫ్ట్ చేసి తాను ఉన్న అడ్ర‌స్ చెప్పింది.

క్ష‌ణం కూడా ఆల‌స్యం చేయ‌కుండా.. రాము, పంచ‌ల్ క‌లిసి బైక్ పై బ్యూటీ పార్ల‌ర్ వ‌ద్ద‌కు చేరుకున్నారు. క‌త్తితో సోను గొంతు కోసి రాము ప‌రారీ అయ్యాడు. ఆ త‌ర్వాత పంచ‌ల్, రామును రాజ‌స్థాన్ కు వెళ్లేలా ఏర్పాట్లు చేశాడు. జోరా ప‌ట్ట‌ణం నుంచి రాజ‌స్థాన్ కేవ‌లం 25 కిలోమీట‌ర్లు మాత్ర‌మే.

ఈ ఘ‌ట‌న‌పై సోను కుటుంబ స‌భ్యులు ఫోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు.. సీసీటీవీ ఫుటేజీల ప‌రిశీలించారు. ఆ ఫుటేజీల ఆధారంగా కేసును పోలీసులు చేధించారు. మొద‌ట పంచ‌ల్ ను అదుపులోకి తీసుకున్నారు. రాము కోసం పోలీసులు గాలిస్తున్నారు. logo