ఆదివారం 29 మార్చి 2020
Crime - Mar 27, 2020 , 06:48:14

కిరాణాషాపునకు వెళ్లిన నవ వధువు అదృశ్యం

కిరాణాషాపునకు వెళ్లిన నవ వధువు అదృశ్యం

హైదరాబాద్ : కిరాణాషాపునకు వెళ్లిన నవ వధువు అదృశ్యమైన సం ఘటన కాచిగూడ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది. ఎస్సై  మధు కథనం ప్రకారం.. గోల్నాక డివిజన్‌, చాదర్‌ఘాట్‌లోని ఎంసీహెచ్‌, కామ్‌గార్‌నగర్‌ ప్రాంతానికి చెందిన సత్యనారాయణ కు  ఐశ్వర్య(20)తో ఈ నెల 20న వివాహం జరిగింది. కరోనా   నేపథ్యంలో ఈ నెల 25న ఉదయం భార్య,భర్తలు కలిసి కిరణా సామాన్ల కోసం నింబోలిఅడ్డా ప్రాంతానికి వెళ్లారు. సామాన్లకు డబ్బులు తక్కువ కావడంతో సత్యనారాయణ ఇంటికి వెళ్లి  తెస్తానని వెళ్లాడు. అతను తిరిగి వచ్చేసరికి ఐశ్వర్య కనిపించలేదు. దీంతో పలు ప్రాంతాలు, బంధువులను ఆరా తీసినా ఆచూకీ లభించలేదు. దీంతో గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.  పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.


logo