గురువారం 01 అక్టోబర్ 2020
Crime - Sep 02, 2020 , 19:05:00

గ్యాస్ క‌ట్ట‌ర్‌తో ఏటీఎం మిష‌న్‌ను విచ్ఛిన్నం చేసి.. రూ.9ల‌క్ష‌లు దోచుకున్నారు

గ్యాస్ క‌ట్ట‌ర్‌తో ఏటీఎం మిష‌న్‌ను విచ్ఛిన్నం చేసి.. రూ.9ల‌క్ష‌లు దోచుకున్నారు

అంబాలా : ఆర్మీ కంటోన్మెంట్ సమీపంలోని అంబాలా-ఢిల్లీ జాతీయ రహదారిపై ఉన్న ఎస్‌బీఐ ఏటీఎం నుంచి కొంతమంది దుండగులు బుధవారం రూ.9.13ల‌క్ష‌లు దోచుకున్నారు. సీసీటీవీ కెమెరాల‌ను ప‌నిచేయ‌కుండా చేసి, గ్యాస్ క‌ట్ట‌ర్ ద్వారా యంత్రాన్ని విచ్ఛిన్నం చేసి డ‌బ్బుల‌ను దొంగిలించిన‌ట్లు పోలీసులు బుధ‌వారం తెలిపారు. 

అంబాలా కాంట్ నుంచి 5 కిలోమీటర్ల దూరంలో షాపూర్ గ్రామంలో ఉన్న ఏటీఎంలో ఈ చోరీ జ‌రిగింద‌ని పోలీసులు తెలిపారు. బుధ‌వారం తెల్ల‌వారుజామున దొంగలు ఏటీఎంలోకి ప్ర‌వేశించార‌ని వారు పేర్కొన్నారు. అయితే మంగ‌ళ‌వారం సాయంత్ర‌మే ఆ ఏటీఎంలో న‌గ‌దు లోడ్ చేసిన‌ట్లు సిబ్బంది తెలిపారు. ప‌క్క‌నే ఉన్న సీసీటీవీ ఫుటేజీ వీడియోల‌ను ప‌రిశీలించ‌గా.. ఇద్ద‌రు వ్య‌క్తులు ముసుగులు ధ‌రించి బ్యాంకు స‌మీపంలోకి వెళ్లిన‌ట్లు గ‌మ‌నించామ‌ని పోలీసులు పేర్కొన్నారు. కేసు న‌మోదు చేసి దుండ‌గుల కోసం వెతుకుతున్నామ‌ని డిప్యూటీ పోలీస్ సూపరింటెండెంట్ రామ్ కుమార్ తెలిపారు.  

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo