ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Crime - Sep 09, 2020 , 14:30:20

ప్రేయసి పెండ్లికి నిరాకరించిందని ప్రియుడి ఆత్మహత్య

ప్రేయసి పెండ్లికి నిరాకరించిందని ప్రియుడి ఆత్మహత్య

కొత్తగూడెం : ప్రేయసి పెండ్లికి నిరాకరించిందని గిరిజన యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన బుధవారం కొత్తగూడెం పట్టణంలోని మధురబస్తీలో వెలుగు చూసింది. పోలీసుల కథనం మేరకు..టేకులపల్లి మండలం బోడు గ్రామానికి చెందిన కె. రామ్ ప్రసాద్ కొత్తగూడెం సింగరేణిలో కాంట్రాక్ట్ చేస్తున్న ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. 

ఇదిలా ఉండగా.. రామ్ ప్రసాద్ తన ప్రేయసిని పెండ్లి చేసుకునేందుకు తనతో వచ్చేయమని కోరడంతో ఇందుకు సదరు యువతి నిరాకరించినట్లు తెలుస్తున్నది. దీంతో తీవ్ర మనస్థాపం చెందిన రామ్ ప్రసాద్ మధురబస్తీలో తాను అద్దెకు ఉంటున్న ఇంట్లో ఫ్యానుకి తాడుతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు ప్రాథమిక సమాచారంలో వెల్లడైంది. 

సంఘటన స్థలాన్ని పరిశీలించిన కొత్తగూడెం వన్ టౌన్ ఇన్స్పెక్టర్ లావుడ్యా రాజు ఆత్మహత్యకు పాల్పడిన రామ్ ప్రసాద్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా వైద్యశాలలోని మార్చూరీలి తరలించరు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


logo