గురువారం 13 ఆగస్టు 2020
Crime - Jul 07, 2020 , 08:07:55

ఆడుకుంటున్న బాలుడికి ఊయలే ఉరితాడైంది.

ఆడుకుంటున్న బాలుడికి ఊయలే ఉరితాడైంది.

కోడూరు :  ఊయలలో ఆడుకుంటున్న బాలుడికి ఆ ఊయలే ఉరితాడైన ఘటన కృష్ణా జిల్లా కోడూరులోని జయపురం ఎస్సీ వాడలో చోటు చేసుకుంది. మద్దాల వెంకటేశ్వర్‌రావు, నాగరాణి దంపతులకు కార్తీక్‌(6), మూడేళ్ల కూతురు ఉన్నారు. వీరు గత కొన్నేళ్లుగా హైదరాబాద్‌లో ఉంటూ జీవనం సాగిస్తున్నారు. ఇటీవల కరోనా కారణంగా తమ సొంత గ్రామమైన జయపురంకు వెళ్లారు. సోమవారం కార్తీక్‌ తన చెల్లెతో కలిసి ఆడుకునేందుకు పక్కింటికి వెళ్లాడు. ఈ క్రమంలో కార్తీక్‌ చీరతో కట్టిన ఊయలలో ఆడుకుంటుండగా చీర మెడకు చుట్టుకొని వదలక పోవడంతో కంగారుపడిన బాలుడు వదిలించుకునే ప్రయత్నం చేశాడు. ఎక్కువ మెలికలు పడడంతో చీర ఉచ్చులా మారింది.

ఇంతలో బాలుడి చెల్లెలు చూసి కేకలు వేయడంతో పెద్దలు వచ్చి కార్తీక్‌ను ఊయల నుంచి కిందకు దింపారు. కానీ అతను అప్పటికే మరణించాడు. కళ్లముందు ఆడుకుంటున్న కుమారుడు మరణించడంతో తల్లిదండ్రులు బోరున విలపించారు. వెంకటేశ్వర్‌రావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు స్థానిక ఎస్‌ఐ రమేష్‌ తెలిపారు.


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డోన్‌లోడ్ చేసుకోండి.


logo