శనివారం 06 మార్చి 2021
Crime - Jan 26, 2021 , 20:12:35

ఒక ఇంజ‌క్ష‌న్‌కు బ‌దులు మ‌రో ఇంజ‌క్ష‌న్‌.. బాలుడు మృతి

ఒక ఇంజ‌క్ష‌న్‌కు బ‌దులు మ‌రో ఇంజ‌క్ష‌న్‌.. బాలుడు మృతి

హైదరాబాద్‌ : ఒక ఇంజ‌క్ష‌న్‌కు బ‌దులు మ‌రో ఇంజ‌క్ష‌న్‌‌ ఇవ్వడంతో బాలుడు మృతిచెందాడు. ఈ విషాద సంఘటన హైదరాబాద్‌ పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. కంటి ప‌రీక్ష‌ల నిమిత్తం బాలుడి(14)ని తల్లిదండ్రులు స్థానిక పంజాగుట్ట‌లోని ఓ ప్రైవేటు కంటి ఆస్పత్రికి తీసుకువెళ్లారు. చికిత్సలో భాగంగా వైద్యులు ఒక ఇంజక్షన్‌కు బదులు మరో ఇంజక్షన్‌ ఇవ్వడంతో బాలుడు మృతిచెందాడు. వివాహం జరిగి 14 ఏళ్ల తర్వాత లేకలేకపుట్టిన కుమారుడు ఇలా విగ‌త‌జీవి కావడంతో తల్లిదండ్రుల వేదన వ‌ర్ణ‌ణాతీతంగా మారింది. జ‌రిగిన ఘోరంపై బాధిత త‌ల్లిదండ్రులు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. రెండు నెలలక్రితం సైతం ఇదే ఆస్పత్రిలో వైద్యం వికటించి ఇద్దరు వ్యక్తులు పూర్తిగా కంటి చూపు కోల్పోయిన‌ట్లుగా స‌మాచారం. 

VIDEOS

logo