మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Crime - Aug 24, 2020 , 14:55:20

సెల్‌ఫోన్‌లో గేమ్ ఆడొద్దన్నందుకు బాలుడు ఆత్మహత్య

సెల్‌ఫోన్‌లో గేమ్ ఆడొద్దన్నందుకు బాలుడు ఆత్మహత్య

పయ్యన్నూర్ : స్మార్ట్‌ఫోన్‌లో గేమ్ ఆడొద్దని తండ్రి మందలించినందుకు గాను కుమారుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కేరళ రాష్ర్టం పయ్యన్నూరులో శనివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. 

పోలీసులు తెలిపిన వివరాలు.. తొమ్మిదో తరగతి చదువుతున్న దేవానందు శనివారం తన తండ్రి సెల్‌ఫోన్‌లో రాత్రి వరకు గేమ్‌ ఆడుతున్నాడు. దీంతో తన తండ్రి సెల్‌ఫోన్‌ లాక్కొని తరచూ ఫోన్‌లో గేమ్‌ ఆడుతున్నావని మందలించి కొట్టాడు. తీవ్ర మనస్థాపానికి గురైన దేవానందు గదిలోకి వెళ్లి తలుపులు వేసుకున్నాడు. 

గదిలోకి వెళ్లడంతో నిద్రపోయాడనుకొని తల్లిదండ్రులు కూడా పట్టించుకోలేదు. ఆదివారం ఉదయం తల్లి తలుపులు కొట్టి నిద్ర లేపడానికి ఎంత ప్రయత్నం చేసినా స్పందన లేకపోవడంతో ఇరుగు పొరుగు వారిని పిలిచి తలుపులు బద్దలు కొట్టి చూడగా దేవానందు ఫ్యాన్‌కు ఉరి వేసుకొని వేలాడుతూ కనిపించాడు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo