బుధవారం 27 జనవరి 2021
Crime - Jan 13, 2021 , 09:38:59

నా చెట్టు పోయింది.. వెతికి పెట్టండి : ‌మాజీ డీజీపీ భార్య‌

నా చెట్టు పోయింది.. వెతికి పెట్టండి : ‌మాజీ డీజీపీ భార్య‌

హైద‌రాబాద్ : త‌మ ఇంటి ఆవ‌ర‌ణ‌లో పెంచుకుంటున్న బొన్సాయి చెట్టు చోరీకి గురైందంటూ మాజీ డీజీపీ అధికారి స‌తీమ‌ణి ఇచ్చిన ఫిర్యాదుతో జూబ్లీహిల్స్ పోలీసులు కేసు న‌మోదు చేశారు. జూబ్లీహిల్స్ రోడ్ నం. 18లో నివాసం ఉంటున్న మాజీ డీజీపీవీ అప్పారావు ఇంటి ఆవ‌ర‌ణ‌లో ప‌లు ర‌కాలైన బొన్సాయి చెట్లు ఉన్నాయి. వాటిలో 15 సంవ‌త్స‌రాల వ‌య‌సు గ‌ల బొన్సాయి చెట్టును గుర్తు తెలియ‌ని వ్య‌క్తి రెండు రోజుల క్రితం అప‌హ‌రించాడు. గుర్తించిన తోట‌మాలి దేవేంద‌ర్ త‌మ య‌జ‌మానికి తెలియ‌జేశాడు. దీంతో విశ్రాంత ఐపీఎస్ అధికారి స‌తీమ‌ణి శ్రీదేవి జూబ్లీహిల్స్ పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌గా.. కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు. అక్క‌డున్న సీసీటీవీ ఫుటేజీల‌ను పోలీసులు ప‌రిశీలిస్తున్నారు. చెట్టును అప‌హ‌రించిన వ్య‌క్తిని గుర్తించి చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్నారు. మూడేళ్ల క్రితం కూడా మాజీ డీజీపీ ఇంట్లో ఓ బొన్సాయి చెట్టును అప‌హ‌రించారు. 


logo