శ్రీకాకుళంలో నాటు బాంబుల కలకలం...

శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లాలో నాటు బాంబుల కలకలం రేపింది. దీంతో ఎప్పుడూ ప్రశాతంగా ఉండే శ్రీకాకుళం జిల్లా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఆ జిల్లాల్లోని మెలియాపుట్టిలో నాటు బాంబులు బయటపడటం స్థానికులందరినీ కలవరపెడుతున్నది. ఆదివారం ఉదయం మెలియాపుట్టిలో ఫ్లైఓవర్ బ్రిడ్జి దగ్గర 18 నాటు బాంబులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరిని అరెస్ట్ చేసినట్టు పోలీసులు ప్రకటించారు. అరెస్టైన నిందితులను ఎర్ర రాజేష్, నవీన్‌గా పోలీసులు గుర్తించారు.
అయితే ఈ బాంబులు ఎందుకు పెట్టారు...ఎవరికోసం పెట్టారు..అలాగే వీళ్ల వెనుక ఏదైన గ్యాంగ్ ఉందా? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. పట్టుబడ్డ నిందితులు స్థానికులు కాదని తెలుస్తున్నది. విచారణ అనంతరం ఈరోజు సాయంత్రం లోగా నిందితులను మీడియా ముందు ప్రవేశపెడుతామని పోలీసులు చెబుతున్నారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ రూ.1000 కోట్లు
- హత్య కేసు నిందితుడిపై పీడీ యాక్ట్ నమోదు
- జనవరిలోనే రవితేజ ‘క్రాక్’ ఓటిటిలో విడుదల..?
- చిరంజీవితో మరోసారి జతకడుతున్న నయనతార?
- కళ్ల కింద నల్లటి వలయాలా? ఇవి తినండి
- సిన్సినాటి డెమోక్రాట్ మేయర్ అభ్యర్థిగా ఇండో అమెరికన్
- ఈ ఐదింటిని భోజనంలో భాగం చేసుకోండి.. ఆరోగ్యంగా ఉండండి!
- పదోన్నతుల ప్రక్రియ వేగంగా పూర్తిచేయాలి : సీఎస్
- తొలి రోజు సక్సెస్.. 1.65 లక్షల మందికి కరోనా టీకా
- గ్రామగ్రామాన వైకుంఠధామాల నిర్మాణం : మంత్రి పువ్వాడ