శుక్రవారం 07 ఆగస్టు 2020
Crime - Jul 11, 2020 , 16:45:20

కూతుళ్లపై తండ్రి అఘాయిత్యం.. భర్తకే భార్య మద్దతు!

కూతుళ్లపై తండ్రి అఘాయిత్యం.. భర్తకే భార్య మద్దతు!

కూతుళ్లపై తండ్రి అఘాయిత్యం.. భర్తకే భార్య మద్దతు!

ముంబై: సభ్య సమాజం సిగ్గుతో తలదించుకోవాల్సిన ఘటన ఇది..! మానవత్వానికి మచ్చతెచ్చే దారుణ ఉదంతమిది..! ఏ తండ్రీ చేయకూడని ఘోరాన్ని ఆ కిరాతకుడు చేశాడు. రక్తం పంచుకు పుట్టిన కూతుర్లపై కన్నతండ్రి అత్యాచారానికి పాల్పడ్డాడు. అలాగే, మూడో కూతురునూ  లైంగికంగా వేధించాడు. ఈ విషయంలో తల్లి కూతుళ్లకు అండగా నిలువాల్సిందిపోయి భర్తకే మద్దతు తెలిపింది. దీంతో కూతుళ్లు ఫిర్యాదు చేయగా, పోలీసులు తల్లిదండ్రులపై కేసు నమోదు చేశారు. కాగా, తన కూతురు చెప్పేవన్నీ అబద్ధాలని, తనకు బెయిల్‌ మంజూరు చేయాలని తల్లి పెట్టుకున్న అభ్యర్థనను ముంబై హైకోర్టు తాజాగా తిరస్కరించింది.

వివరాల్లోకెళితే, మహారాష్ట్రలోని బీడ్‌ జిల్లాకు చెందిన ఓ హెడ్‌మాస్టర్‌కు ముగ్గురు కూతుళ్లు.  అతడు తన 20 ఏళ్ల కుమార్తెను మార్చి 31న లైంగికంగా వేధించేందుకు ప్రయత్నించాడు, ఆమె సోదరీమణులు ఎదురించారు. తల్లిదండ్రులిద్దరూ వారిని కొట్టి గదిలో బంధించారు. అయితే, వారు ఓ స్నేహితురాలి సాయంతో ఏప్రిల్ 2న బయటపడ్డారు. వెంటనే తమ తల్లిదండ్రులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. 2012లో తండ్రి తనపై అత్యాచారం చేశాడని పెద్ద కూతురు  ఫిర్యాదులో తెలిపింది. ఈ సంఘటన గురించి తన తల్లికి చెబితే తీవ్రంగా కొట్టిందని పేర్కొంది. ఇప్పుడు 18 ఏళ్లున్న తన చెల్లెలిపై కూడా తండ్రి ఐదో తరగతిలో ఉన్నప్పుడు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడడని తెలిపింది.  ఈ సంఘటనల గురించి తల్లికి చెప్పినప్పుడల్లా ఆమె తండ్రి చేసిన నేరాల గురించి ఎవరికీ చెప్పవద్దని హెచ్చరించేదని పేర్కొన్నారు. 2018లో తమ తండ్రి తమ 15 ఏళ్ల చిన్న చెల్లెలిపై అత్యాచారం చేసేందుకు కూడా ప్రయత్నించారని ఆరోపించారు. తల్లి అప్పుడు కూడా మౌనంగా ఉండిపోయిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. పెద్ద కుమార్తె ఫిర్యాదు మేరకు బీడ్‌లోని కాజీ పోలీసులు ఏప్రిల్ 2న ప్రధానోపాధ్యాయుడితోపాటు అతడి భార్యను అరెస్ట్‌ చేశారు. 

అయితే, తన కుమార్తె ఇచ్చిన ఫిర్యాదు అబద్ధమని, ఆమెను చెడు తిరుగుళ్లు మానుకొమ్మని వారించినందుకే తమపై కేసుపెట్టిందని తల్లి పేర్కొంది. ఈ మేరకు తనకు బెయిల్‌ మంజూరు చేయాలని కోర్టును కోరింది. దీనిపై, విచారించిన  జస్టిస్‌ కంకన్‌వాడీ ఆధ్వర్యంలో సింగిల్‌ బెంచ్‌ బెయిల్‌ ఇచ్చేందుకు తిరస్కరించింది. కూతుళ్లు చెప్పిన కథ దిగ్భ్రాంతికి గురిచేసిందని కంకన్‌వాడీ పేర్కొన్నారు. పెద్ద కుమార్తె చెడుతిరుగుళ్లు తిరుగుతున్నారని తల్లి ఆరోపిస్తున్నదని, అప్పుడు ఆమెకు చెల్లెళ్లు ఎలా మద్దతిస్తారని తల్లి తరఫు న్యాయవాదిని జస్టిస్‌ కంకన్‌వాడీ ప్రశ్నించారు. కూతుళ్లు చేసిన ఆరోపణల్లో స్థిరత్వం ఉన్నట్లు తమకు అనిపిస్తోందని, అందుకే బెయిల్‌ను తిరస్కరిస్తున్నట్లు చెప్పారు. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్   డౌన్‌లోడ్ చేసుకోండి.లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo