శనివారం 23 జనవరి 2021
Crime - Nov 11, 2020 , 15:21:14

ఢిల్లీలో శ‌వం క‌ల‌క‌లం.. మృతుడి త‌ల‌పై బుల్లెట్ గాయం

ఢిల్లీలో శ‌వం క‌ల‌క‌లం.. మృతుడి త‌ల‌పై బుల్లెట్ గాయం

న్యూఢిల్లీ: దేశ రాజ‌ధాని ఢిల్లీలో శ‌వం క‌ల‌క‌లం రేపింది. వెస్ట్ ఢిల్లీలోని చావ్లా ఏరియాలో ‌నిలిపి ఉంచిన ఓ కారులో వ్య‌క్తి శ‌వాన్ని చూసి స్థానికులు భ‌యాందోళ‌న‌కు గుర‌య్యారు. వెంట‌నే పోలీసులకు స‌మాచారం ఇవ్వ‌డంతో వారు అక్క‌డికి చేరుకుని ప‌రిశీలించారు. మృతుడి త‌ల‌పై తూటా గాయం ఉన్న‌ట్లు గుర్తించారు. దీనిపై కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టిన పోలీసులు.. మృత‌దేహాన్ని పోస్ట్‌మార్టానికి త‌ర‌లించారు. ఘ‌ట‌నా స్థ‌లంలో ఎలాంటి ఆధారాలు ల‌భించ‌లేద‌ని.. అస‌లు ఇది హ‌త్యో, ఆత్మ‌హ‌త్యో తేలాల్సి ఉంద‌ని పోలీసులు చెప్పారు. త‌దుప‌రి ద‌ర్యాప్తు కొన‌సాగుతున్న‌ద‌న్నారు.     

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo