ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Crime - Aug 24, 2020 , 11:59:54

కనికరం లేకుండా లైంగిక దాడి చేసి హతమార్చారా.!

కనికరం లేకుండా లైంగిక దాడి చేసి హతమార్చారా.!

గొడ్డ : జార్ఖండ్‌లోని గొడ్డ జిల్లా  మెహర్మా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖిరోండి గ్రామంలో దివ్యాంగ బాలిక (13) అనుమానాస్పదంగా మృతి చెందింది. సోమవారం గ్రామంలోని పాఠశాల గదిలో బాలిక మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. బాలికపై లైంగికదాడి చేసి హతమార్చి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. బాధిత కుటుంబాన్ని స్థానిక ఎమ్మెల్యే దీపికా పాండే సింగ్ పరామర్శించారు. నిందితులను అరెస్టు చేసి ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి శిక్షపడేలా చూస్తామని హామీ ఇచ్చారు. బాలికను పాఠశాలలోకి ఏవరు తీసుకువచ్చారు.. ఎప్పుడు తీసుకువచ్చారు.! తదితర అన్ని వివరాలను గ్రామస్తులను విచారించి పోలీసులు తెలుసుకుంటున్నారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo