బుధవారం 23 సెప్టెంబర్ 2020
Crime - Sep 01, 2020 , 20:36:29

అదృశ్యమైన ముగ్గురు బాలికలు.. చెరువులో తేలిన మృతదేహాలు

అదృశ్యమైన ముగ్గురు బాలికలు.. చెరువులో తేలిన మృతదేహాలు

భువనేశ్వర్: అదృశ్యమైన ముగ్గురు బాలికలు.. చెరువులో శవమై తేలారు. ఒడిశా రాష్ట్రంలోని కొరాపుట్‌లో ఈ ఘటన జరిగింది. డియోగంజ్ గ్రామానికి చెందిన ముగ్గురు బాలికలు సోమవారం మాయమయ్యారు. దీంతో బాలికల తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, డియోగంజ్ గ్రామంలోని ఒక చెరువులో ముగ్గురు బాలికల మృతదేహాలను స్థానికులు మంగళవారం గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వారి మృతదేహాలను బయటకు తీయించారు. అయితే ఆ ముగ్గురు బాలికలు స్నానం కోసం చెరువులోకి దిగి ఉంటారని, లోతులోకి వెళ్లి మునిపోయి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కాగా ఆ ముగ్గురి బాలికల మరణంతో వారి ఇండ్లలో తీవ్ర విషాదం నెలకొన్నది.లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo