సోమవారం 25 జనవరి 2021
Crime - Oct 19, 2020 , 08:47:09

ములుగు హాస్పిటల్‌కు మావోయిస్టుల మృతదేహాలు

ములుగు హాస్పిటల్‌కు మావోయిస్టుల మృతదేహాలు

ములుగు : మంగపేటలో ఆదివారం ఎదురుకాల్పుల్లో మృతి చెందిన ఇద్దరు మావోయిస్టుల మృతదేహాలను పోలీసులు ములుగు ప్రాంతీయ దవాఖానకు తరలించారు. పోస్ట్‌మార్టం అనంతరం మృతదేహాలను మార్చురీలో భద్రపరిచారు. అయితే ఎదురుకాల్పుల్లో మృతి చెందిన మావోయిస్టుల వివరాలు తెలియరాలేదు. ఆచూకీ తెలుసుకునేందుకు పోలీసులు ఫొటోలతో పాటు నోట్‌ను విడుదల చేశారు. ఆదివారం నరసింహసాగర్‌ అటవీప్రాంతంలో నిషేధిత సీపీఐ మావోయిస్టులు, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయని, ఇందులో ఇద్దరు మరణించారని తెలిపారు. మృతదేహాలని గుర్తించడం కోసం ములుగు ప్రభుత్వ హాస్పిటల్‌లోని మార్చురీలో భద్రపరిచినట్లు పేర్కొన్నారు. బంధువులతో పాటు ఎవరైనా మృతదేహాలను గుర్తిస్తే ములుగు జిల్లా పోలీసులను సంప్రదించాలని కోరారు. కంట్రోల్‌ రూమ్‌ 7337029296, ఎస్పీ కార్యాలయం 08715-295100, ఏటూనాగారం ఏఎస్పీ కార్యాలయం 7901141447 నంబర్లలో సంప్రదించాలని కోరారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo