అమర జవాన్లకు నివాళులర్పించిన మంత్రి ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్సీ కవిత

హైదరాబాద్ : జమ్మూ కశ్మీర్‌లోని కుప్వారాలో వీరమరణం పొందిన సరిహద్దు భద్రతా దళానికి (బీఎస్ఎఫ్) చెందిన తెలుగు సైనికులు ర్యాక మహేశ్, ప్రవీణ్‌కుమార్‌రెడ్డి మృతదేహాలు మంగళవారం రాత్రి బేగంపేట విమానాశ్రయానికి చేరాయి. అమర సైనికుడు మహేశ్ పార్థీవ దేహానికి తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్, మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో పాటు ఆర్మీ అధికారులు, నార్త్ జోన్ డీసీపీ కమలేశ్వర్ ఘన నివాళులర్పించారు. దేశ రక్షణలో వారి సేవలను కొనియాడారు. అనంతరం ప్రత్యేక వాహనంలో మహేశ్ భౌతిక కాయాన్ని స్వగ్రామం నిజామాబాద్ జిల్లాకు, ప్రవీణ్‌కుమార్‌రెడ్డి పార్థీవ దేహాన్ని రేణిగుంట విమానాశ్రయానికి తరలించారు. అంతకు ముందు ఎమ్మెల్సీ కవిత.. మహేశ్ కుటుంబ సభ్యులను పరామర్శించారు.
గత శనివారం జమ్ముకశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య భీకర కాల్పులు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనలో ముగ్గురు జవాన్లు, ఒక సైనికాధికారి అమరులయ్యారు. ఉత్తర కశ్మీర్‌లోని వాస్తవాధీన రేఖ (ఎల్వోసీ)కు సమీపంలోని మచిల్ సెక్టార్లో అనుమానాస్పద కదలికలను గుర్తించిన పెట్రోలింగ్ బలగాలు నిఘాను పటిష్టం చేశాయి. శనివారం అర్థరాత్రి దాటాక భద్రతా బలగాలపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డంతో సైన్యం ప్రతిఘటించింది. ఒక ఉగ్రవాదితో పాటు సరిహద్దు భద్రతా దళానికి (బీఎస్ఎఫ్) చెందిన కానిస్టేబుల్ ఒకరు మరణించారు. ఆదివారం ఉదయం 10.20 గంటల ప్రాంతంలో ఉగ్రవాదులు అదే ప్రాంతంలో మళ్లీ చొరబాట్లకు యత్నించడంతో సైన్యానికి, ఉగ్రవాదులకు మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు సైనికులతోపాటు ఒక ఆర్మీ అధికారి మరణించారు. ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఆదివారం జరిగిన ఎన్కౌంటర్లో నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం కోమన్‌పల్లికి చెందిన ఆర్మీ జవాన్ ర్యాడ మహేశ్(26), హల్దార్ హోదాలో పని చేస్తున్న ఏపీలో చిత్తూరు జిల్లాకు చెందిన ప్రవీణ్‌కుమార్‌రెడ్డి వీరమరణం పొందారు.
మహేశ్ 2015లో ఆర్మీ జవాన్‌గా విధుల్లో చేరాడు. మహేశ్ 6వ తరగతి వరకు వేల్పూర్ మండలం కుకునూర్ ప్రభుత్వ పాఠశాలలో, 7-10వ తరగతి వరకు వేల్పూర్‌లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదివారు. బాల్యం నుంచి దేశభక్తి భావాలు ఉన్న మహేశ్ ప్రత్యేక ఆసక్తితో ఆర్మీలో చేరారు. మహేశ్‌కు తల్లి ర్యాడ గంగు, తండ్రి గంగమల్లు, అన్న భూమేశ్ ఉన్నారు. మహేశ్ ఏడాది క్రితం సుహాసినిని ప్రేమవివాహం చేసుకున్నాడు. ఏడాది క్రితం ఇంటికి వచ్చి నెల రోజుల పాటు ఉండి వెళ్లాడు.
ప్రవీణ్‌కుమార్‌రెడ్డి అసమాన వీరుడిగా పేరు తెచ్చుకున్నారు. హవల్దార్ హోదాలో సైన్యంలో విధులు నిర్వహిస్తున్న ఆయన ఇటీవలే అత్యంత కఠినమైన కమెండో శిక్షణను కూడా పూర్తిచేసుకున్నారు. చిత్తూరు జిల్లా ఐరాల మండలం రెడ్డివారిపల్లె ప్రవీణ్‌కుమార్‌రెడ్డి స్వస్థలం. గత 18 ఏండ్లుగా ఆయన భారత సైన్యంలో భాగమైన మద్రాస్ రెజిమెంట్‌లో పనిచేస్తున్నారు. ఆయనకు భార్య రజిత, కుమార్తె, కుమారుడు ఉన్నారు. ప్రవీణ్‌కుమార్‌రెడ్డి మరణవార్తతో ఆయన భార్యాపిల్లలతోపాటు తల్లిదండ్రులు ప్రతాప్‌రెడ్డి, సుగుణమ్మ గుండెలవిసేలా విలపిస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- ప్రజలను రెచ్చగొట్టే టీవీ ప్రోగ్రామ్‌లను ఆపేయండి..
- ‘టాయ్ ట్రైన్‌ను ప్రారంభించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్’
- అగ్రి చట్టాలకు వ్యతిరేకంగా మమతా తీర్మానం
- త్వరలోనే నిరుద్యోగ భృతి : మంత్రి కేటీఆర్
- నిమ్మగడ్డ బెదిరింపులకు భయపడేది లేదు: మంత్రి పెద్దిరెడ్డి
- దేశంలో 165కు చేరిన కొత్త రకం కరోనా కేసులు
- 2021 మెగా ఫెస్టివల్..ఈ ఏడాది 14 సినిమాలు..!
- హైవేపై ఎస్యూవీ నడిపిన ఐదేళ్ల చిన్నారి
- సీసీఎంబీ నేతృత్వంలో ఆర్టీ-పీసీఆర్ వర్క్‌షాప్‌లు
- ప్రమాద బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుంది