మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Crime - Sep 09, 2020 , 15:23:34

బ‌హిర్భూమికి వెళ్లిన‌ప్పుడు ఫొటోలు తీసి బ్లాక్‌మెయిల్.. బాలిక ఆత్మ‌హ‌త్య‌

బ‌హిర్భూమికి వెళ్లిన‌ప్పుడు ఫొటోలు తీసి బ్లాక్‌మెయిల్.. బాలిక ఆత్మ‌హ‌త్య‌

ఫిరోజాబాద్ : బ‌హిర్భూమికి వెళ్లిన‌ప్పుడు బాలిక‌ ఫొటోలు తీసి కొంత‌మంది యువ‌కులు వేధించ‌డంతో ఆమె ఆత్మ‌హ‌త్య చేసుకున్న ఘ‌ట‌న ఉత్త‌ర్‌ప్ర‌దేశ్‌లోని ఫిరోజాబాద్‌లో చోటు చేసుకుంది. ఈ ఘ‌ట‌న నాలుగు రోజుల‌ క్రితం జ‌ర‌గ్గా మంగ‌ళ‌వారం కేసు న‌మోదైంది. 

వివ‌రాలు..  థానా జిల్లాలోని నార్ఖి ప్రాంతం మార్స‌ల్ గంజ్ గ్రామానికి చెందిన ఓ మైన‌ర్‌ను అదే గ్రామానికి చెందిన కొంత‌మంది యువ‌కులు నిత్యం వేధింపుల‌కు గురి చేసేవారు. ఈ క్ర‌మంలో ఈనెల 2న బాలిక బ‌హిర్భూమికి వెళ్లిన‌ప్పుడు వారు చాటుగా అశ్లీల ఫొటోలు, వీడియోలు తీసి గ్రామ‌స్తుల‌కు చూపించారు. ఈ విష‌యం బాలిక ఇంట్లో తెలియ‌డంతో ఆమె సోద‌రుడు వెళ్లి వారితో గొడ‌వ‌కు దిగాడు. నిందితులు ఆమె సోద‌రుడిని విచ‌క్ష‌ణా ర‌హితంగా కొట్ట‌డంతో అత‌డు పోలీసుల‌ను ఆశ్ర‌యించాడు. 

ఈ గొడ‌వ‌లు జ‌రుగుతుండ‌గా ఒక‌రోజు బాలిక ఇంట్లో ఒంట‌రిగా ఉన్న‌ప్పుడు నిందితులు వెళ్లి మ‌రొక‌సారి త‌మ జోలికి వ‌స్తే నీ సోద‌రుడిని, నిన్ను చంపేస్తామ‌ని బెదిరించ‌డంతో తీవ్ర భ‌యాందోళ‌న‌కు గురైన యువ‌తి పురుగుల మందు తాగేసింది. కుటుంబ స‌భ్యులు గ‌మ‌నించి ఆమెను ద‌వాఖాన‌కు త‌ర‌లించ‌గా చికిత్స పొందుతూ ఒక‌రోజు త‌రువాత మ‌ర‌ణించింది. స‌మాచారం అందుకున్న పోలీసులు బాలిక‌ మృత‌దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ద‌వాఖాన‌కు త‌ర‌లించి, ఐదుగురు యువ‌కుల‌పై కేసు న‌మోదు చేసుకున్న‌ట్లు తెలిపారు. అయితే నిందితులు ప్రస్తుతం ప‌రారీలో ఉన్నార‌ని వీలైనంత త్వ‌ర‌లో వారిని అదుపులోకి తీసుకుంటామ‌ని ఎస్పీ ముఖేశ్‌ చంద్ర మిశ్రా అన్నారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo