Crime
- Nov 13, 2020 , 17:18:57
బైక్ దొంగలు అరెస్టు.. 30 బైక్‌లు స్వాధీనం

హైదరాబాద్ : బైక్‌లు దొంగతనం చేస్తున్న ఏడుగురు సభ్యుల ముఠాను నగరంలోని సైబరాబాద్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. సైబరాబాద్ సీపీ సజ్జనార్ మీడియా ద్వారా వివరాలను వెల్లడించారు. ముఠా సభ్యులు రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బైకులను దొంగిలిస్తున్నారన్నారు. ముఠా ప్రధాన సూత్రధారి రాజ్‌కుమార్ అన్నారు. ముఠాలో నలుగురు బాల నేరస్థులు ఉన్నట్లు వీరిని జువైనల్ హోంకు తరలించినట్లు తెలిపారు. చెడు అలవాట్లు, జల్సాలకు బానిసలై ముఠా సభ్యులు చోరీలు చేస్తున్నట్లుగా వెల్లడించారు. చోరీ చేసిన బైక్‌లను నాందేడ్‌లో అమ్మేవారన్నారు. ముఠా నుంచి 30 బైక్‌లను స్వాధీనం చేసుకున్నట్లు సీపీ పేర్కొన్నారు.
తాజావార్తలు
MOST READ
TRENDING