గురువారం 21 జనవరి 2021
Crime - Dec 08, 2020 , 21:42:56

దొంగ అరెస్టు.. బైక్‌లు స్వాధీనం

దొంగ అరెస్టు.. బైక్‌లు స్వాధీనం

హైదరాబాద్‌ : బైక్‌లు దొంగిలిస్తున్న వ్యక్తిని నగరంలోని వెస్ట్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ సిబ్బంది మంగళవారం అరెస్టు చేసింది. నిందితుడి వద్ద నుంచి రెండు బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. కేసు వివరాలిలా ఉన్నాయి. మొహమ్మద్‌ ఖాన్‌ అలియాస్‌ మమ్ము(20). టోలిచౌకీ నివాసి. నానాల్‌నగర్‌లో టీ స్టాల్‌లో పనిచేస్తున్నాడు. ఖాన్‌ గంజాయికి బానిసయ్యాడు. గంజాయికి డబ్బులు సమకూర్చడం ఇబ్బందులు మారే పరిస్థితులు తలెత్తాయి. దీంతో క్రమంగా దొంగతనం వైపు మొగ్గుచూపాడు. బహిరంగ ప్రదేశాల్లో పార్క్‌ చేసిన బైక్స్‌ను దొంగిలించడం ప్రారంభించినట్లు టాస్క్‌ఫోర్స్‌ డీసీపీ పి. రాధాకృష్ణారావు తెలిపారు.

గడిచిన మూడు వారాల్లో లంగర్‌హౌజ్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో రెండు బజాజ్‌ పల్సర్‌ బైక్‌లను దొంగిలించాడు. సీసీటీవీ కెమెరాల్లో నమోదైన దృశ్యాల రికార్డు ఆధారంగా పోలీసులు నిందితుడి గుర్తించారు. విచారణలో గంజాయి కోసం తానే బైక్‌లను దొంగిలించినట్లు అంగీకరించాడు. వ్యక్తితో పాటు బైక్‌లను లంగర్‌హౌజ్‌ పోలీసు స్టేషన్‌లో అప్పగించారు.


logo