మంగళవారం 11 ఆగస్టు 2020
Crime - Jul 05, 2020 , 18:04:26

హిజ్రాల హ‌త్య‌కు మ‌రో హిజ్రా కుట్ర‌!

హిజ్రాల హ‌త్య‌కు మ‌రో హిజ్రా కుట్ర‌!

న్యూఢిల్లీ: దేశ రాజ‌ధాని ఢిల్లీలో ఇద్ద‌రు హిజ్రాలు ల‌క్ష్యంగా హ‌త్య‌య‌త్నం జ‌రిగింది. బైక్‌పై వ‌చ్చిన ఇద్ద‌రు దుండ‌గులు హిజ్రాల‌పై కాల్పులు జ‌రిపారు. అయితే అదే స‌మ‌యంలో అక్క‌డున్న ఓ కానిస్టేబుల్ నిందితుల‌ను అడ్డిగించాడు. దీంతో కానిస్టేబుల్‌పైనా కాల్పుల‌కు ప్ర‌య‌త్నించారు. వెంట‌నే అప్ర‌మ‌త్త‌మైన కానిస్టేబుల్‌ దుండ‌గుల బైకును బ‌లంగా నెట్టివేయ‌డంతో కిందప‌డ్డారు. అనంత‌రం అటుగా వ‌చ్చిన ఓ ఆటోలో దూరి పారిపోయారు. కానిస్టేబుల్ ద్వారా స‌మాచారం అందుకున్న మిగ‌తా పోలీసులు నిందితులు పారిపోతున్న ఆటోను చేజ్‌చేసి వారిని అదుపులోకి తీసుకున్నారు. కాల్పుల్లో తీవ్రంగా గాయ‌ప‌డ్డ హిజ్రాల‌ను ఆస్ప‌త్రిలో చేర్చారు. సినిమాలో ఫైట్‌ను త‌ల‌పించే ఈ ఘ‌ట‌న ఢిల్లీలోని అంబేద్క‌ర్ న‌గ‌ర్‌లో చోటుచేసుకుంది.

వివ‌రాల్లోకి వెళ్తే.. గ‌త ఏడాది ఏప్రిల్‌లో గ‌ణేశ్ అనే హిజ్రా హ‌త్య‌కు గుర‌య్యాడు. షాలు అనే మ‌రో హిజ్రా ఈ హ‌త్య‌కేసులో నిందితురాలిగా ఉన్న‌ది. షాలు స్నేహితురాలు ఆలియాకు కూడా ఈ హ‌త్య‌కేసుతో సంబంధం ఉన్న‌ది. ఈ నేప‌థ్యంలో గ‌త ఏడాది హ‌త్య‌కు గురైన గ‌ణేశ్ స్నేహితురాలు పింకీ.. షాలు, ఆలియాల‌పై క‌క్ష పెంచుకుంది. వారిని హ‌త్య చేయించాల‌ని నిర్ణ‌యించుకుని ముఖేశ్, క‌పిల్ అనే ఇద్దరు కిరాయి హంత‌కుల‌తో ఒప్పందం చేసుకుంది. ఈ నేప‌థ్యంలో నిందితులు శ‌నివారం షాలు, ఆలియాల‌ హ‌త్య‌కు ప్ర‌య‌త్నించి విఫ‌ల‌మ‌య్యారు. పోలీసుల‌కు ప‌ట్టుబ‌డ్డారు. పోలీసులు త‌మ‌దైన రీతిలో ప్ర‌శ్నించ‌డంతో వివ‌రాలు మొత్తం బ‌‌య‌ట‌పెట్టారు.      

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డోన్‌లోడ్ చేసుకోండి.


logo