బుధవారం 12 ఆగస్టు 2020
Crime - Jul 16, 2020 , 15:33:50

కూతురు ప్రేమ‌వివాహం.. తండ్రి ఆత్మ‌హ‌త్యాయ‌త్నం

కూతురు ప్రేమ‌వివాహం.. తండ్రి ఆత్మ‌హ‌త్యాయ‌త్నం

యాదాద్రి భువ‌న‌గిరి : కూతురు ప్రేమ వివాహం చేసుకోవ‌డంతో.. తండ్రి తీవ్ర మ‌న‌స్తాపానికి గుర‌య్యాడు. తండ్రి ఆత్మ‌హ‌త్య చేసుకునేందుకు ప్ర‌య‌త్నిస్తుండ‌గా.. పోలీసులు కాపాడారు. ఈ ఘ‌ట‌న బీబీ న‌గ‌ర్ రైల్వే స్టేషన్ కు స‌మీపంలో గురువారం ఉద‌యం చోటు చేసుకుంది. పోచంప‌ల్లి మండ‌లానికి చెందిన కే ర‌మేశ్‌(50) ఓ ప్ర‌యివేటు ఇంజినీరింగ్ కాలేజీ బ‌స్సు డ్రైవ‌ర్ గా ప‌ని చేస్తున్నాడు. అయితే ర‌మేశ్ కూతురు ఇటీవ‌లే ప్రేమ వివాహం చేసుకుంది.

దీంతో ఆయ‌న తీవ్ర మ‌న‌స్తాపానికి గుర‌య్యాడు. ఆత్మ‌హ‌త్య చేసుకునేందుకు రైలు ప‌ట్టాల‌పైకి గురువారం ఉద‌యం చేరుకున్నాడు. ఆ వ్య‌క్తిని గుర్తించిన మ‌రొక‌రు పోలీసుల‌కు స‌మాచారం అందించారు. హుటాహుటిన కానిస్టేబుల్స్ డీ ముర‌ళి, మ‌ల్లేష్ అక్క‌డికి చేరుకుని ర‌మేశ్‌ను ప్రాణాల‌తో కాపాడారు.  ర‌మేశ్ ను బీబీన‌గ‌ర్ పోలీసు స్టేష‌న్ కు త‌ర‌లించి.. కౌన్సెలింగ్ ఇచ్చి కుటుంబ స‌భ్యుల‌కు అప్ప‌జెప్పారు.


logo