ఏటీఎం దోపిడీకి విఫలయత్నం.. ముగ్గురు యువకులు అరెస్టు

భోపాల్ : మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో ఏటీఎం దోపిడీకి యత్నించిన ముగ్గురు యువకులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ నెల 4న ఖుషీలాల్ ఆయుర్వేదిక్ కళాశాల సమీపంలోని ఏటీఎంను గ్యాస్ కట్టర్తో కత్తిరించి నగదు అపహరించేందుకు ముగ్గురు యువకులు యత్నించారు. చోరీకి యత్నించిన వారిలో ఒకరు షాపుర ప్రాంత వాసి అని తెలియడంతో అతడిపై పోలీసులు నిఘా పెట్టారు. గురువారం ఉదయం బైక్పై తిరుగుతుండగా అదుపులోకి తీసుకున్నారు.
నిందితుడిని రాజా బర్లే్ అలియాస్ బవందర్(22) గా గుర్తించారు. ఉత్తర ప్రదేశ్లోని మహోబా జిల్లా కు చెందిన ఇతను వలస వచ్చి షాపూర ప్రాంతంలోని గులాబ్నగర్లో నివాసం ఉంటున్నాడు. మీరానగర్కు చెందిన ఇతడి స్నేహితుడు, రౌడీషీటర్ సావన్ అలియాస్ గణేశ్(20)కు డబ్బు అవసరం ఉండటంతో మరో స్నేహితుడు విజయ్ దగ్సే(18)తో కలిసి ఏటీఎం దోపిడీకి యత్నించినట్లు చూనాబట్టి పోలీస్ స్టేషన్ ఇన్చార్జి శివరాజ్ సింగ్ తెలిపారు. సావన్పై ఇప్పటికే 10 కేసులుండగా.. బవందర్పై 5 కేసులున్నాయని ఆయన వెల్లడించారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.