e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, August 4, 2021
Home News కూతురిపై మూడేళ్లుగా అత్యాచారం

కూతురిపై మూడేళ్లుగా అత్యాచారం

కూతురిపై మూడేళ్లుగా అత్యాచారం

భోపాల్ : కంటికి రెప్ప‌లా కాపాడుకోవాల్సిన తండ్రే కూతురు ప‌ట్ల కీచ‌కుడిగా మారాడు. 19 ఏండ్ల వ‌య‌సున్న కూతురుపై మూడేండ్లుగా తండ్రి అత్యాచారం చేస్తున్నాడు. ఈ ఘ‌ట‌న మ‌ధ్య‌ప్ర‌దేశ్ రాజ‌ధాని భోపాల్‌లోని అయిష్‌బాగ్ ఏరియాలో చోటు చేసుకుంది. మూడేండ్ల నుంచి కూతురిపై అత్యాచారం చేస్తూ.. బ‌య‌ట‌కు విష‌యం చెబితే చంపేస్తాన‌ని బ్లాక్ మెయిల్ చేస్తూ వ‌స్తున్నాడు తండ్రి.

సోమ‌వారం కూడా తండ్రి ఆమెపై లైంగిక‌దాడికి పాల్ప‌డ్డాడు. ఈ విష‌యం ఎవ‌రికైనా చెబితే.. తల్లిని, సోద‌రుడిని కిటికీలో నుంచి బ‌య‌ట‌కు తోసేస్తాన‌ని బెదిరించాడు. తండ్రి వేధింపులు భ‌రించ‌లేని ఆ యువ‌తి త‌న త‌ల్లితో క‌లిసి పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. మూడేండ్ల క్రితం తాను ఒంట‌రిగా ఉన్న స‌మ‌యంలో తండ్రి అత్యాచారం చేశాడ‌ని, ఎవ‌రికైనా చెబితే త‌మ్ముడిని చంపేస్తాన‌ని బెదిరించాడు అని బాధిత యువ‌తి త‌న ఫిర్యాదులో పేర్కొన్న‌ది. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
కూతురిపై మూడేళ్లుగా అత్యాచారం
కూతురిపై మూడేళ్లుగా అత్యాచారం
కూతురిపై మూడేళ్లుగా అత్యాచారం

ట్రెండింగ్‌

Advertisement