బుధవారం 12 ఆగస్టు 2020
Crime - Jul 11, 2020 , 15:04:07

మాటల్లో పెట్టి.. ఆమె ఖాతా వాడేశారు..

మాటల్లో పెట్టి.. ఆమె ఖాతా వాడేశారు..

హిమాయత్‌నగర్‌కు చెందిన ఓ మహిళ ఖాతాలో గుర్తుతెలియని వ్యక్తులు రూ. 2 లక్షలు జమ చేశారు. అయితే.. ఆ ఖాతాలో ఆ డబ్బు పడ్డట్లు ఆమెకు తెలియదు. సైబర్‌నేరగాళ్లు ఆమెకు ఫోన్‌ చేసి మాటల్లో పెట్టి ..బ్యాంకు ఖాతా అప్‌గ్రేడ్‌ చేయాలంటూ..  ఆమె నుంచి ఓటీపీలు తెలుసుకొని.. ఆ డబ్బును తిరిగి ఖాళీ చేశారు. అయితే సైబర్‌నేరగాళ్లు ఇతరులను మోసం చేస్తూ, వాళ్లకు రుణాలిప్పిస్తామంటూ నమ్మించి ప్రాసెసింగ్‌ ఫీజులంటూ రూ. 2 లక్షలు వసూలు చేసి.. ఆ డబ్బు బాధితుడి నుంచి నేరుగా నగరవాసి ఖాతాలో జమ చేయించారు. ఆ తరువాత ఆమెకు ఫోన్‌ చేసి,  ఆ డబ్బును తిరిగి తమ ఖాతాల్లోకి మళ్లించారు. ఇక్కడ ఎలాంటి సంబంధం లేని రవినా ఖాతాలోకి సైబర్‌నేరగాళ్లు రెండు లక్షలు జమ చేసి, ఆ తరువాత తిరిగి డ్రా చేశారు. మరో ఘటనలో.. తమ ఖాతాల్లోకి లోను డబ్బులంటూ గుర్తుతెలియని వ్యక్తులు  డిపాజిట్‌ చేశారని, ఆ తర్వాత తిరిగి వాళ్లు తమ ఖాతాల్లోకి బదిలీ చేసుకున్నారంటూ పలువురు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

తాజావార్తలు


logo