శనివారం 19 సెప్టెంబర్ 2020
Crime - Sep 12, 2020 , 15:05:42

బెట్టింగ్ రాయుళ్లు అరెస్ట్

బెట్టింగ్ రాయుళ్లు అరెస్ట్

కాన్పూర్ : కాన్పూర్‌లో పలుచోట్ల దాడులు జరిపి ఆరుగురు క్రికెట్ బెట్టింగ్ రాయుళ్ల‌ను శ‌నివారం పోలీసులు అరెస్టు చేశారు. ఈ ముఠా కొన్నేండ్ల నుంచి ఐపీఎల్‌తో పాటు ఇత‌ర లీగ్ మ్యాచ్‌లపై బెట్టింగ్ వేస్తున్నార‌నే స‌మాచారం మేర‌కు దాడులు జ‌రిపిన‌ట్లు పోలీసులు తెలిపారు. 

కాన్పూర్ డీఐజీ ప్రీతీందర్ సింగ్ మాట్లాడుతూ ఈ ముఠా వాట్సాప్, ఇత‌ర మొబైల్ అనువర్తనాల ద్వారా తమ వ్యాపారాన్ని నిర్వహించేవార‌న్నారు. మ్యాచ్ ముగిసిన తరువాత వారు లావాదేవీలు చేసేవార‌ని,  కాన్పూర్‌లో కనీసం ఐదు చోట్ల దాడులు జ‌రిపిన‌ట్లు పేర్కొన్నారు. నిందితుల్లో ఒకరి వ‌ద్ద నుంచి నేపాలీ క‌రెన్సీ కూడా స్వాధీనం చేసుకున్న‌ట్లు తెలిపారు. ఒక నగదు లెక్కింపు యంత్రం, 11 మొబైల్ ఫోన్లు, ఒక ల్యాప్‌టాప్, రూ.93 లక్షల న‌గ‌దు స్వాధీనం చేసుకొని ఆరుగురిపై కేసులు న‌మోదు చేశామ‌న్నారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo