బుధవారం 23 సెప్టెంబర్ 2020
Crime - Jul 13, 2020 , 18:59:22

పెళ్లి పేరుతో యువతికి 7లక్షలు కుచ్చుటోపీ

పెళ్లి పేరుతో యువతికి 7లక్షలు కుచ్చుటోపీ

బెంగ‌ళూరు : పెళ్లి అనగానే అమ్మాయిలు ఎన్నెన్నో క‌ల‌లు కంటారు. త‌మ రాకుమారుడి కోసం వెయ్యి క‌ళ్ల‌తో ఎదురుచూస్తుంటారు. అలాంటి రాకుమారుడి కోసం వెతుకుతూనే ఉంటారు. ఓ యువ‌తి కూడా త‌న‌కు న‌చ్చిన అబ్బాయి కోసం ప‌లు మ్యాట్రిమోని వెబ్ సైట్ల‌ను సంప్ర‌దించింది. చివ‌ర‌కు త‌న మ‌న‌సుకు న‌చ్చిన యువ‌కుడు దొరికాడు. పెళ్లి చేసుకోవాల‌నుకుంటున్నాన‌ని అత‌నికి చెప్పేసింది. ఆమె మ‌న‌సుచ్చి మ‌నువ‌డాల‌నుకుంది.. కానీ అత‌నేమో మ‌ధ్య‌లోనే మోసం చేసి ముఖం చాటేశాడు. 

క‌ర్ణాట‌క‌లోని వ‌ర్తూరుకు చెందిన మైత్రి(27).. ఎన్నారై సంబంధం కోసం ప‌లు మ్యాట్రిమోని వైబ్ సైట్ల‌ను సంప్ర‌దించింది. ఈ క్ర‌మంలో నెద‌ర్లాండ్స్ కు చెందిన ఆశిష్ ఎం అనే యువ‌కుడు మైత్రికి ప‌రిచ‌యం అయ్యాడు. వీరిద్ద‌రి మ‌న‌సులు క‌లిశాయి. నిన్ను పెళ్లి చేసుకుంటాన‌ని ఆశిష్ కు మైత్రి చెప్పింది. అత‌ను కూడా ఒకే చెప్పేశాడు. 

ఇక ఆశిష్ త‌ల్లిని అని చెప్పి మోనికా మ‌నీష్ అనే మ‌హిళ మైత్రికి ఫోన్ చేసింది. తాను న‌ర్సుగా ప‌ని చేస్తున్నాన‌ని చెప్పింది. పెళ్లి గురించి మాట్లాడేందుకు త్వ‌ర‌లోనే ఇండియాకు వ‌స్తాన‌ని మైత్రికి చెప్పి ఫోన్ పెట్టేసింది. 

ఒక రోజు క‌స్ట‌మ్స్ విభాగానికి చెందిన అధికారి పేరుతో ఓ వ్య‌క్తి మైత్రికి ఫోన్ చేశాడు. ఆశిష్, మోనికాను అరెస్టు చేశామ‌ని, వారిని విడిపించేందుకు కొంత డ‌బ్బు అవ‌స‌రం అవుతుంద‌ని ఫోన్ లో తెలిపాడు. దీంతో మైత్రి.. ఐదు ద‌ఫాలుగా రూ. 7,23,600ల‌ను వారు సూచించిన ఖాతాకు బ‌దిలీ చేసింది. ఆ త‌ర్వాత ఆశిష్, మోనికా ఫోన్లు క‌ల‌వ‌డం లేదు.  

ఈ త‌తంగ‌మంతా 2019 డిసెంబ‌ర్, 2020 జ‌న‌వ‌రి మ‌ధ్య కాలంలో చోటు చేసుకుంది. ఆ త‌ర్వాత ఆశిష్ నుంచి స్పంద‌న లేక‌పోవ‌డంతో.. తాను మోస‌పోయాన‌ని మైత్రి గ్ర‌హించింది. దీంతో ఆమె పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు విచార‌ణ చేప‌ట్టారు. మైత్రి నుంచి డ‌బ్బులు లాగేందుకే అరెస్టు నాట‌క‌మాడార‌ని పోలీసులు తెలిపారు. 


logo