బుధవారం 23 సెప్టెంబర్ 2020
Crime - Sep 10, 2020 , 21:52:41

కర్ణాటకలో భారీగా గంజాయి నిల్వలు స్వాధీనం

కర్ణాటకలో భారీగా గంజాయి నిల్వలు స్వాధీనం

బెంగళూరు : కర్ణాటక కల్బుర్గీ జిల్లాలో అక్రమంగా నిల్వ చేసిన గంజాయిని బెంగళూరు సెంట్రల్ డివిజన్ పోలీసులు గురువారం స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో నలుగురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఆగస్టు 30న వీవీ కాలనీ ప్రాంతంలో గంజా విక్రయిస్తున్న జ్ఞానశేఖర్‌ అనే వ్యక్తిని శేషాద్రిపురం పోలీసులు అరెస్టు చేసి 2 కిలోగ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ (ఎన్‌డీపీఎస్) చట్టం కింద కేసు నమోదు చేశారు. తరువాత, సెప్టెంబర్ 8న మాదనాయకనహళ్లి ప్రాంతానికి సమీపంలో సిద్ధనాథ లావతే అనే మరో వ్యక్తిని అరెస్టు చేశారు. లావతే ఇచ్చిన సమాచారంతోఈ కేసులో సంబంధం ఉన్న మరో నలుగురిని కల్బుర్గీ జిల్లాలో అరెస్టు చేశారు. వారిని విచారించి కలగి తాలూకాలోని ఓ వ్యవసాయ భూమిలో నిల్వ చేసిన 600 ప్యాకెట్లలోని 1,200 కిలోల గంజాయిని సీజ్‌ చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo