శనివారం 19 సెప్టెంబర్ 2020
Crime - Aug 22, 2020 , 16:51:53

బాలిక‌పై సామూహిక‌ అత్యాచారం ఆపై హ‌త్య చేసి సెప్టిక్‌ట్యాంక్‌లో ప‌డేసిన వైనం

బాలిక‌పై సామూహిక‌ అత్యాచారం ఆపై హ‌త్య చేసి సెప్టిక్‌ట్యాంక్‌లో ప‌డేసిన వైనం

కోల్‌క‌తా : ఓ బాలిక‌(16)పై కొంద‌రు వ్య‌క్తులు ప‌లుమార్లు సామూహిక అత్యాచారానికి పాల్ప‌డ్డారు. అనంత‌రం బాలిక‌ను హ‌త్య చేసి మృత‌దేహాన్ని సెప్టిక్ ట్యాంక్‌లో ప‌డేశారు. ఈ తీవ్ర విషాద సంఘ‌ట‌న ప‌శ్చిమ బెంగాల్‌లోని జల్పాయిగురి జిల్లాలో చోటుచేసుకుంది. ఈ కేసులో పోలీసులు ఇప్ప‌టివ‌ర‌కు ముగ్గురు వ్య‌క్తులను అరెస్టు చేశారు. కోర్టులో హాజ‌రుప‌ర‌చ‌గా న్యాయ‌స్థానం ఎనిమిది రోజుల పోలీసు క‌స్ట‌డీకి అప్పగించింది.  రాజ్‌గంజ్‌లోని శైన‌షిక‌ట గ్రామ నివాసియైన బాలిక ఈ నెల 10వ తేదీన క‌నిపించ‌కుండా పోయింది. బాలిక అదృశ్యంపై త‌ల్లిదండ్రులు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు.

కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. పోలీసులు గురువారం నాడు ముగ్గురు వ్య‌క్తుల‌ను అరెస్టు చేశారు. విచార‌ణ సంద‌ర్భంగా తామే అత్యాచారం చేసి హ‌త్య‌చేసిన‌ట్లు నిందితులు అంగీక‌రించారు. మృత‌దేహాన్ని ఇంట్లోని సెప్టిక్ ట్యాంక్‌లో ప‌డేసిన‌ట్లు తెలిపారు. పోలీసులు మృత‌దేహాన్ని సెప్టిక్‌ట్యాంకు నుంచి వెలికితీశారు. స్థానిక తృణ‌మూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఖ‌గేష్‌రాయ్ బాధిత కుటుంబాన్ని ప‌రామ‌ర్శించారు. దోషుల‌కు ఉరిశిక్ష వేయాల్సిందిగా డిమాండ్ చేశారు. 


logo