Crime
- Oct 02, 2020 , 11:19:41
రైతుపై ఎలుగుబంట్ల దాడి ..తీవ్ర గాయాలు

మెదక్ : ఎలుగుబంట్ల దాడిలో ఓ రైతు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ విషాద ఘటన జిల్లాలోని హవేలీఘనపూర్ మండలం కొత్తపల్లిలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన రైతు కుర్మ మొగులయ్య తన పొలం వద్దకు వెళ్లాడు. ఈ క్రమంలో రైతుపై మూడు ఎలుగుబంట్లు ఒక్కసారిగా దాడి చేశాయి. దాడిలో మొగులయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. గుర్తించిన స్థానికులు అతడిని మెదక్ ఏరియా దవాఖానకు తరలించారు. ప్రథమ చికిత్స అందించిన తరువాత మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కు తరలించారు.
తాజావార్తలు
MOST READ
TRENDING