శనివారం 19 సెప్టెంబర్ 2020
Crime - Sep 03, 2020 , 13:43:23

జ‌గిత్యాల జిల్లాలో ట్రిపుల్ ఐటీ విద్యార్థిని అనుమానాస్ప‌ద మృతి

జ‌గిత్యాల జిల్లాలో ట్రిపుల్ ఐటీ విద్యార్థిని అనుమానాస్ప‌ద మృతి

జ‌గిత్యాల : జిల్లాలోని మ‌ల్యాల మండ‌ల కేంద్రానికి చెందిన ట్రిపుల్ ఐటీ విద్యార్థిని అనుమానా‌స్ప‌ద స్థితిలో మృతి చెందింది. ట్రిపుల్ ఐటీ విద్యార్థిని తేజ‌స్విని అంత్య‌క్రియ‌ల‌ను ర‌హ‌స్యంగా నిర్వ‌హించేందుకు త‌ల్లిదండ్రులు య‌త్నించారు. స‌మాచారం అందుకున్న పోలీసులు అక్క‌డికి చేరుకుని తేజ‌స్విని అంత్య‌క్రియ‌ల‌ను అడ్డుకున్నారు. మృతురాలి మెడ‌పై గాయాలు ఉండ‌డంతో పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు. ‌మృతురాలు బాస‌ర ట్రిపుల్ ఐటీలో బీటెక్ థ‌ర్డ్ ఇయ‌ర్ చ‌దువుతోంది. తేజ‌స్విని ఎవ‌రైనా హ‌త్య చేశారా? లేక ఆత్మ‌హ‌త్య చేసుకుందా? అన్న కోణంలో పోలీసులు ద‌ర్యాప్తు జ‌రుపుతున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo