శుక్రవారం 22 జనవరి 2021
Crime - Oct 09, 2020 , 14:41:54

ఆస్తికోసం కుమారుడినే చంపి పూడ్చేసి..

ఆస్తికోసం కుమారుడినే చంపి పూడ్చేసి..

బ‌రేలి : ఆస్తి కోసం క‌న్న‌తండ్రే క‌సాయిలా మారుడు. మ‌రో ఇద్ద‌రితో క‌లిసి కుమారుడిని పాశ‌వికంగా హ‌త్య చేయించాడు. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని బ‌రేలీ జిల్లా క్విలా ప్రాంతంలో జ‌రిగిన ఈ ఘ‌ట‌న ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది.  క్విలా ప్రాంతానికి చెందిన తండ్రీకుమారుల న‌డుమ కొంత‌కాలంగా ఆస్తి వివాదం న‌డుస్తోంది. ఏప్రిల్‌లో తండ్రి మ‌రో ఇద్ద‌రి సాయంతో కుమారుడిని కొట్టిచంపి గుట్టుచ‌ప్పుడు కాకుండా పూడ్చాడు. 

కోడ‌లు అనుమానంతో పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డంతో మృత‌దేహాన్ని బ‌య‌ట‌కు తీసి గురువారం పోస్టుమార్టం నిర్వ‌హించారు. మృతుడి ఛాతి, త‌ల‌పై బ‌ల‌మైన గాయాలుండ‌టంతో అస‌హ‌జ మ‌ర‌ణంగా గుర్తించారు. మృతుడి భార్య ఫిర్యాదు చేసినా కేసు న‌మోదులో నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించిన ఎస్‌హెచ్ఓ మ‌నోజ్ కుమార్‌‌ను స‌స్పెండ్ చేసిన‌ట్లు ఎస్ఎస్‌పీ రోహిత్ సింగ్ స‌జ్వాన్ తెలిపారు. మృతుడి తండ్రితోపాటు సోద‌రుడిని అదుపులోకి తీసుకున్న‌ట్లు ఆయ‌న పేర్కొన్నారు.  మ‌రొక‌రు ప‌రారీలో ఉన్న‌ట్లు వెల్ల‌డించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo