సోమవారం 21 సెప్టెంబర్ 2020
Crime - Jul 04, 2020 , 17:27:29

ద‌ళితుడికి క‌టింగ్ చేసేందుకు నిరాక‌ర‌ణ‌

ద‌ళితుడికి క‌టింగ్ చేసేందుకు నిరాక‌ర‌ణ‌

అహ్మ‌దాబాద్ : దేశ వ్యాప్తంగా ఉన్న ప‌లువురు సామాజిక కార్య‌క‌ర్త‌లు.. స‌మాన‌త్వం కోసం అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారు. కులం, వివ‌క్ష నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు పోరాటం చేస్తూనే ఉన్నారు. అయిన‌ప్ప‌టికీ దేశంలో ఎక్క‌డో ఓ చోట ద‌ళిత సామాజిక వ‌ర్గం వివ‌క్ష‌కు గుర‌వుతూనే ఉంది. 

గుజ‌రాత్ లోని కుచ్ లో ఓ మంగ‌ళి దుకాణ‌దారుడు.. ద‌ళితుడికి కటింగ్ చేసేందుకు నిరాక‌రించాడు. ప‌దంపూర్ గ్రామానికి చెందిన ధ‌రంశీ వాలంద్ అనే వ్య‌క్తి మంగ‌ళి దుకాణం నిర్వ‌హిస్తున్నాడు. అత‌ని వ‌ద్ద‌కు క‌టింగ్ చేయించుకునేందుకు ద‌ళిత వ్య‌క్తి ర‌మేశ్ పార్మార్ వెళ్లాడు. షాపు నుంచి త‌క్ష‌ణ‌మే వెళ్లిపోవాల‌ని, సాయంత్రం క‌లుస్తాన‌ని ర‌మేశ్ కు ధ‌రంశీ చెప్పాడు. అంత‌టితో ఆగ‌కుండా కులం పేరుతో దూషించాడు వాలంద్.  వీరిద్ద‌రూ సాయంత్రం క‌లుసుకుని కులం పేరుతో గొడ‌వ ప‌డ్డారు. ద‌ళితుల‌కు క‌టింగ్ చేయ‌న‌ని వాలంద్ చెప్పాడు. ద‌ళిత వ్య‌క్తుల‌కు క‌టింగ్ చేయ‌ని దుకాణాన్ని మూసివేయాల‌ని ర‌మేశ్ డిమాండ్ చేశాడు.   కులం పేరుతో దూషించిన ధ‌రంశీపై ర‌మేశ్ పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చ‌ట్టం కింద పోలీసులు కేసు న‌మోదు చేశారు.

తాజావార్తలు


logo