బుధవారం 12 ఆగస్టు 2020
Crime - Jul 16, 2020 , 14:40:11

అమెరికాలో బంగ్లాదేశ్ సీఈవో దారుణహత్య

అమెరికాలో బంగ్లాదేశ్ సీఈవో దారుణహత్య

న్యూయార్క్ : బంగ్లాదేశ్‌కు చెందిన రెండు కంపెనీల సీఈవో ఫహీమ్ సలేహ్ దారుణహత్యకు గురయ్యారు. ఆయన మృతదేహాన్ని న్యూయార్క్ లోని లగ్జరీ అపార్ట్‌మెంట్ నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అపార్ట్మెంట్ లో అతని శరీరం భాగాలు చెల్లాచెదురుగా పడివున్నాయి. ఘటనా స్థలం నుంచి విద్యుత్ రంపంను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వ్యాపార శత్రుత్వంలో భాగంగానే సలేహ్ దారుణహత్య జరిగివుంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.

ఫహీమ్ సోదరి మంగళవారం మధ్యాహ్నం తన అపార్ట్మెంట్కు చేరుకున్న సమయంలో శవానికి దగ్గరగా ఎలక్ట్రిక్ రంపాలతో ఒక వ్యక్తి పనిచేస్తూ ఉన్నాడు. ఆమెను చూడగానే నిందితుడు రెండవ గేటు నుంచి తప్పించుకుని పారిపోయాడు. మొండెం, తల, కాళ్ళు, చేతులు నరికి వేరు చేయబడ్డాయి. పాలిథీన్ సంచుల్లో ముక్కలను నింపేందుకు నిందితుడు సిద్ధమయ్యే సమయంలో ఫహీమ్ సోదరి వచ్చింది. ఫహీమ్ ఫోన్ తీయకపోవడంతో సోదరుడిని కలవడానికి నేరుగా అపార్ట్మెంట్కు వచ్చానని సలేహ్ సోదరి పోలీసులకు తెలిపింది.

నైజీరియా రైడింగ్ అండ్ డెలివరీ యాప్ కంపెనీకి సీఈవోగా సలేహ్ ఉన్నారు. అలాగే, బంగ్లాదేశ్‌లో 'పాథో' పేరుతో ఇలాంటి కంపెనీనే నడుపుతున్నాడు. న్యూయార్క్ లో అతను హత్య చేయబడిన అపార్ట్మెంట్ విలువ సుమారు 2.2 మిలియన్లు డాలర్లు.

సీసీటీవీ ఫుటేజీ స్వాధీనం

పోలీసులు సీసీటీవీ ఫుటేజీలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఫుటేజీలో ఒకదానిలో సలేహ్ ఎలివేటర్‌లో కనిపించగా.. మరో ఫుటేజీలో నలుపు రంగు సూటులో ఉన్న మరో వ్యక్తితో కనిపంచాడు. హంతకుడు ఫహీమ్ సన్నిహితుడే అని పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితుడికి అపార్ట్మెంట్ లోని అన్ని భాగాలు తెలుసు అని, శవాన్ని ముక్కలుగా కోసి తనతో తీసుకెళ్లాలని అనుకోగా ఫహీం సోదరి రావడంతో ప్రయత్నం విఫలమైందని పోలీసులు భావిస్తున్నారు.

సాలెహ్ తల్లిదండ్రులు బంగ్లాదేశ్ కు చెందినవారు కానీ, సౌదీ అరేబియాలో నివసించారు. ఫహీమ్ 2018 లో నైజీరియాకు చెందిన మోటారు సైకిల్ రైడ్ షేరింగ్ సంస్థ గోక్డాను ప్రారంభించాడు. తరువాత దీనిని డెలివరీ సేవగా కూడా మార్చాడు. అదే సంవత్సరం కిక్బ్యాక్ యాప్స్ సీఈవో అయ్యారు. 


logo