సోమవారం 21 సెప్టెంబర్ 2020
Crime - Aug 14, 2020 , 12:43:50

బెంగళూరు హింస.. కాంగ్రెస్ కార్పొరేటర్ భర్త సహా 200 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

బెంగళూరు హింస.. కాంగ్రెస్ కార్పొరేటర్ భర్త సహా 200 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

బెంగళూరు : కర్ణాటక రాష్ట్రం బెంగళూరులో జరిగిన హింసాకాండలో పోలీసుల చర్యలు కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ కార్పొరేటర్ ఇర్షాద్ బేగం భర్త కలీం పాషను పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. కలీం పాషపై హింసకు పాల్పడినట్లు ఆరోపణలున్నాయని పోలీసులు తెలిపారు. కలీం పాష నాగ్వరా వార్డు కార్పొరేటర్‌ ఇర్షాద్ బేగం భర్త. తాజాగా ఈ ఘటనపై మరో 60 మందిని అరెస్టు చేయగా ఇప్పటివరకు మొత్తం 206 మందిని అదుపులోకి తీసుకున్నట్లు బెంగళూరు పోలీస్‌ కమిషనర్ సందీప్ పాటిల్ చెప్పారు.

ఈ అరెస్టు తరువాత హింసాకాండలో కాంగ్రెస్ పాత్ర బహిర్గతమైందని  మంత్రి సుధాకర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. హింసకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ కార్పొరేటర్ భర్తను పోలీసులు అరెస్ట్ చేశారని ఆయన తెలిపారు. 

ఓ ఫేస్‌బుక్ పోస్టుపై బెంగళూరులో హింస చెలరేగిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీనివాస్ మూర్తి ఇల్లు, పోలీస్ స్టేషన్‌పై ముఠా దాడి చేసినప్పుడు ముగ్గురు మరణించగా, 60 మందికి పైగా పోలీసులు గాయపడ్డారు. 250 వాహనాలను అల్లరి మూకలు తగులబెట్టినట్లు పోలీసులు తెలిపారు. అభ్యంతరకరమైన పోస్ట్ రాసిన వ్యక్తి ఎమ్మెల్యే దగ్గర ఉండగా అతడిని పోలీసులు అరెస్టు చేశారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo