శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Crime - Aug 21, 2020 , 13:06:55

కొలనులో ఏనుగు పిల్ల కళేబరం

కొలనులో ఏనుగు పిల్ల కళేబరం

రూర్కెలా : ఒడిశా సుందర్‌ఘర్‌ జిల్లా హేమ్‌గిర్ అటవీ ప్రాంతంలోని ఓ కొలనులో శుక్రవారం ఉదయం గ్రామస్తులు ఏనుగు పిల్ల కళేబరాన్ని గుర్తించి అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. అటవీశాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని కళేబరాన్ని కొలను నుంచి బయటకు తీశారు. అడవిలోని ఏనుగుల మంద నుంచి ఇది విడిపోయి ప్రమాదానికి గురై ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. కళేబరాన్ని పోస్టుమార్టం కోసం పంపామని, పూర్తి దర్యాప్తు అనంతరం మృతికి గల కారణాలు వెల్లడిస్తామని అటవీ అధికారులు తెలిపారు. కొలను సమీపంలో నీటి వనరులుండడంతో ఇక్కడికి నీరు తాగేందుకు ఎనుగుల మంద వస్తోందని స్థానికులు పేర్కొంటున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo