ఆదివారం 24 జనవరి 2021
Crime - Oct 12, 2020 , 12:31:11

అయ్యో.. నాలాలో ప‌సికందు మృత‌దేహం

అయ్యో.. నాలాలో ప‌సికందు మృత‌దేహం

హైద‌రాబాద్ : ఇది హృద‌య‌విదార‌క ఘ‌ట‌న‌.. ఆ దృశ్యాన్ని చూస్తుంటే మ‌న‌సు క‌కావిక‌ల‌మ‌వుతోంది. ముక్కుప‌చ్చ‌లార‌ని రెండు నెల‌ల ప‌సికందు మృత‌దేహం నాలాలో తేలింది. ఈ అమానుష ఘ‌ట‌న నాగారం చెరువుకు స‌మీపంలో చోటు చేసుకుంది.

కాప్రా చెరువు నుంచి నాగారం చెరువుకు వెళ్లే నాలాలో ల‌క్ష్మీన‌ర‌సింహ కాల‌నీ వ‌ద్ద ఉన్న క‌ల్వ‌ర్ట్ ద‌గ్గ‌ర రెండు నెల‌ల ప‌సిపాప మృత‌దేహాన్ని స్థానికులు గుర్తించారు. దీంతో స్థానికులు పోలీసుల‌కు స‌మాచారం అందించారు. ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకున్న పోలీసులు పాప మృత‌దేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ప‌సిబిడ్డ‌ను ఎవ‌రైనా హ‌త్య చేసి ఇక్క‌డ ప‌డేశారా? లేక వ‌ర్ష‌పు నీటిలో కొట్టుకుపోయి నాలాలో వ‌చ్చి ప‌డ్డ‌దా? అన్న కోణంలో పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు. కాప్రా - నాగారం మ‌ధ్య‌లో ఉన్న సీసీ కెమెరాల‌ను పోలీసులు ప‌రిశీలిస్తున్నారు.


logo