సోమవారం 28 సెప్టెంబర్ 2020
Crime - Jul 30, 2020 , 17:41:13

50 మందిని హత్యచేసి, కిడ్నీలు దొంగిలించిన డాక్టర్‌ అరెస్ట్‌

50 మందిని హత్యచేసి, కిడ్నీలు దొంగిలించిన డాక్టర్‌ అరెస్ట్‌

న్యూ ఢిల్లీ: వైద్యవృత్తికే కళంకం తెచ్చిన ఓ డాక్టర్‌ను ఢిల్లీ పోలీసులు తాజాగా అరెస్ట్‌ చేశారు. ప్రజలకు ప్రాణాలు పోయాల్సిన అతడు.. ప్రాణాలు తీస్తూ.. కిడ్నీలు అపహరించి ఇతరులకు ట్రాన్స్‌ప్లాంటేషన్‌ చేసిన కేసులో శిక్ష అనుభవిస్తున్నాడు. అయితే, జనవరిలో పెరోల్‌పై వెళ్లి, తప్పించుకున్నాడు. ఢిల్లీలోని బాప్రోలా ప్రాంతంలో క్రైం బ్రాంచ్‌ పోలీసులకు చిక్కాడు.

ఉత్తర ప్రదేశ్‌లోని అలీగ్రా జిల్లా పురేని గ్రామానికి చెందిన బీఏఎంఎస్ డిగ్రీ హోల్డర్ దేవేందర్‌శర్మ(62)  కిడ్నాప్, హత్య కేసుల్లో దోషిగా తేలినట్లు పోలీసులు తెలిపారు. వివిధ రాష్ట్రాల్లో 2004లో మూత్రపిండ మార్పిడి రాకెట్‌ను నడిపినందుకు అతను జైలు పాలయ్యాడు. 1994 నుంచి 2004 వరకు శర్మ 125కు పైగా అక్రమ కిడ్నీ మార్పిడిలు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. దీని కోసం అతను కేసుకు ఐదు నుంచి ఏడు లక్షల రూపాయలు పొందాడన్నారు. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, హర్యానా, రాజస్థాన్‌లలో ట్రక్‌, ట్యాక్సీ  డ్రైవర్లను అటకాయించి, వారిని హత్యచేసి, కిడ్నీలు దొంగలించేవాడని పేర్కొన్నారు. కాగా, ప్రస్తుతం జైపూర్‌ సెంట్రల్‌ జైలులో హత్య, కిడ్నాప్‌, చీటింగ్‌ కేసుల్లో జీవితఖైదు అనుభవిస్తున్నాడు. ఈ ఏడాది జనవరిలో పెరోల్‌పై వెళ్లి తప్పించుకున్నాడు. అతడు ఢిల్లీలో ఉంటున్నట్లు పక్కా సమాచారంతో వెళ్లిన ఢిల్లీ క్రైం బ్రాంచ్‌ పోలీసులకు దొరికాడు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo