తెలంగాణ సిగలో మరో అంతర్జాతీయ సంస్థ విరబూసింది. ప్రపంచ రియల్ ఎస్టేట్ రంగంలో పేరుగాంచిన ఇవాన్హో కేంబ్రిడ్జ్.. హైదరాబాద్‌లోని లైఫ్ సైన్సెస్ ఆర్అండ్డీ ఫెసిలిటీస్‌లో భారీ
పెట్టుబడులకు ముందుకొచ్చింది.
హైదరాబాద్, జూలై 7: ఇవాన్హో కేంబ్రిడ్జ్.. పెట్టుబడుల్లో ఘన చరిత్ర కలిగిన సంస్థే. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ప్రపంచ ఖ్యాతిని ఆర్జించిన కంపెనీ. 1953లో దీన్ని స్థాపించారు. దీని మాతృ సంస్థ సీడీపీక్యూ. వేగంగా విస్తరిస్తున్న నగరాల్లో భారీ షాపింగ్ సెంటర్ల ఏర్పాటే లక్ష్యంగా ఇవాన్హో దూసుకుపోతున్నది. ఈ క్రమంలోనే ఇవాన్హో నిర్వహణలో నేడు ఎన్నో దేశాల్లో మెగా షాపింగ్ మాల్స్ కొలువుదీరి ఉన్నాయి.
ఇన్వెస్ట్మెంట్ ప్లాట్‌ఫామ్స్, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ ద్వారా నేరుగా లేదా భాగస్వాములతో కలిసి ఇవాన్హో పెట్టుబడులు పెడుతున్నది. మల్టీ-రెసిడెన్షియల్ ప్రాపర్టీలు, ఇండస్ట్రియల్/లాజిస్టిక్స్ రియల్ ఎస్టేట్, షాపింగ్ సెంటర్లు, ఆఫీస్ ప్రాపర్టీలు, హోటల్స్ నిర్వహణలో దిగ్గజంగా పేరొందింది.
ఖండాంతర వ్యాపారాలు కెనడా, అమెరికా, బ్రెజిల్ దేశాలతో పాటు ఆసియా, ఐరోపా ఖండాల్లోని చాలా దేశాల్లో కార్యకలాపాలను ఇవాన్హో నిర్వర్తిస్తున్నది. ప్రపంచవ్యాప్తంగా సంస్థకు ఆస్తులుండగా, ప్రస్తుతం వీటి విలువ రూ.5 లక్షల కోట్లపైనేనని అంచనా వేస్తున్నారు.
ప్రస్తుతం ఇవాన్హో కేంబ్రిడ్జ్ సంస్థ ప్రపంచ టాప్ టెన్ రియల్ ఎస్టేట్ సంస్థల్లో ఒకటిగా ఉన్నది. గతేడాది డిసెంబర్ నాటికి ప్రపంచ వ్యాప్తంగా దాదాపు రూ.3.62 లక్షల కోట్ల ఆస్తులను కలిగి ఉన్నది. వచ్చే పదేండ్లలో టొరంటో, పారిస్, టెక్సాస్ తదితర నగరాల్లో భారీ నిర్మాణాలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నది. తాజాగా మన నగరంలోని జీనోమ్ వ్యాలీలో మొదటిసారి మరో సంస్థ భాగస్వామ్యంతో రూ.740 కోట్లకుపైగా పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చింది. ఒక కెనడియన్ సంస్థ లైఫ్ సైన్సెస్ ఆర్అండ్డీ ఫెసిలిటీస్ లో దక్షిణాసియాలోనే ఇంత భారీ పెట్టుబడితో ముందుకు రావడం ఇదే మొదటిసారి.
ఇవాన్హో కేంబ్రిడ్జ్స్థాపన: మే 12, 1953 ప్రధాన కేంద్రం: మాంట్రియల్ (కెనడా) పరిశ్రమ: రియల్ ఎస్టేట్, ఇన్వెస్ట్మెంట్స్, డెవలప్మెంట్, అసెట్ మేనేజ్మెంట్
ప్రస్తుతం మొత్తం ఆస్తులు: దాదాపు రూ.5 లక్షల కోట్లు