వనపర్తి : వనపర్తి జిల్లా పరిధిలో మూడు బాల్య వివాహాలు అధికారులు అడ్డుకున్న సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. జిల్లా సంక్షేమ శాఖ అధికారి పుష్పలత తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పెద్ద మందడి మండలం ఖానాపూర్ గ్రామంలో ఓ బాలికకు ఈ నెల 16 వ తేదీన వివాహం జరుగుతున్నదని సమాచారం అందుకున్న జిల్లా బాలల పరిరక్షణ కమిటీ అధికారులు అప్రమత్తమయ్యారు.
ఐసీడీఎస్ అధికారులు, గ్రామ పెద్దల సమక్షంలో ఇరు వర్గాలకు అవగాహన కల్పించారు. బాల్య వివాహాలు చేస్తే కఠిన కారాగార శిక్ష పడుతుందని అవగాహన కల్పించారు. అలాగే పాన్ గల్ మండలం శాఖ పూర్ తండాలో బాలిక కు ఎంగేజ్మెంట్ జరిగిందని చైల్డ్ లైన్ 1098 కి సమాచారం రావడంతో బాలిక తల్లిదండ్రులకు అవగాహ కల్పించారు.
18 సంవత్సరాలు నిండకుండా వివాహం జరపమని బాలల సంక్షేమ సమితి బృందానికి వీడియో కాల్ ద్వారా మాట్లాడించి పెళ్లి చేయమని లిఖిత పూర్వకంగా రాయించారు. శ్రీ రంగపురం మండలం నాగరాల గ్రామంలో మైనరు బాలిక వివాహం జరుగుతున్న విషయం తెలుసుకున్న చైల్డ్ లైన్ అధికారులు అమ్మాయిని , తల్లిదండ్రులను బాలల సంక్షేమ సమితి, వనపర్తి నందు హాజరు పర్చారు.
వారికి బాలల న్యాయ మూర్తులు అవగాహన కల్పించి, 18 సంవత్సరాల వయసు రాకుండ పెళ్లి చేయమని ఒప్పించి లిఖిత పూర్వ హామీని తీసుకున్నారు.
ఇవి కూడా చదవండి..
వ్యాక్సిన్ల కొరత : మోదీ సర్కార్ పై చిదంబరం ఫైర
అనుమానాస్పదస్థితిలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు మృతి
రైతులు అధైర్యపడొద్దు.. అండగా ఉంటాం