శనివారం 26 సెప్టెంబర్ 2020
Crime - Jul 28, 2020 , 18:39:38

హోం క్వారంటైన్‌లో ఉన్న వ్యక్తి ఆత్మహత్యాయత్నం

హోం క్వారంటైన్‌లో ఉన్న వ్యక్తి ఆత్మహత్యాయత్నం

హైదరాబాద్‌ : ఇటీవల గల్ఫ్‌ దేశం నుంచి వచ్యిన ఓ వ్యక్తి హోం క్వారంటైన్‌లో ఉండి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. వివరాలు.. జగిత్యాల జిల్లా సారంగ్‌పూర్‌ మండలానికి చెందిన యువకుడు గల్ఫ్‌ దేశాల్లో కూలి పనులు చేసుకొని జీవనం సాగించేవాడు. లాక్‌డౌన్‌ కారణంగా ఇటీవల ఆ వ్యక్తి స్వగ్రామానికి తిరిగొచ్చాడు. స్థానికుల సమాచారం మేరకు అధికారులు ఆ యువకుడిని కలిసి కరోనా వ్యాప్తి దృష్ట్యా హోం క్వారంటైన్‌లో ఉండాల్సిందిగా ఆదేశించారు. సరేనని క్వారంటైన్‌లో ఉంటున్న యువకుడు తనకు కరోనా సోకిందేమోనని, తన కుటుంబ సభ్యులకు ఏదైనా అవుతుందేమోనని భయపడి మంగళవారం కిరోసిన్‌ పోసుకొని ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు.  గమనించిన కుటుంబ సభ్యులు మంటలార్పి క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం జగిత్యాల ప్రభుత్వ దవాఖానకు తరలించారు. యువకుడి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo