సోమవారం 26 అక్టోబర్ 2020
Crime - Sep 29, 2020 , 15:46:58

ఏపీజీవీబీ బ్యాంక్ దోపిడీకి విఫలయత్నం

ఏపీజీవీబీ బ్యాంక్ దోపిడీకి విఫలయత్నం

మెదక్ : గుర్తు తెలియని దుండగులు బ్యాంకు దోపిడీకి విఫలయత్నం చేశారు. జిల్లాలోని పాపన్నపేట మండలం యూసుఫ్ పేట ఏపీజీవీబీ బ్యాంకులో వెనక పక్క గోడకు దొంగలు కన్నం వేశారు. లోనికి వెళ్లి సీసీ కెమెరాలకు సంబంధించిన వైర్లను కత్తిరించారు. గ్రిల్స్ తాళాలు పగులగొట్టి లాకర్ ఓపెన్ చేయడానికి విఫలయత్నం చేశారు. కంప్యూటర్ కు సంబంధించిన సామగ్రిని ఎత్తుకెళ్లి పొలాల్లో పడేశారు. మెదక్ రూరల్ సీఐ పాలవెల్లి సంఘటన స్థలానికి చేరుకొని క్లూస్ టీమ్ తో ఆధారాలు సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు. సోమవారం రాత్రి ఘటన జరగగా ఉదయం గుర్తించారు. ఎలాంటి నగదు అపహరణకు గురి కాలేదు.logo