మంగళవారం 20 అక్టోబర్ 2020
Crime - Sep 21, 2020 , 12:26:15

పెళ్లికి నిరాకరించిందని ప్రియురాలిపై దాడి.. ప్రియుడు ఆత్మహత్యాయత్నం

పెళ్లికి నిరాకరించిందని ప్రియురాలిపై దాడి.. ప్రియుడు ఆత్మహత్యాయత్నం

నల్లగొండ : నల్లగొండ జిల్లా చింతపల్లి మండలంలో దారుణం చోటు చేసుకుంది. పెళ్లికి నిరాకరించిందన్న కోపంతో ప్రేమించిన యువతిపై యువకుడు దాడికి పాల్పడ్డాడు. కిష్టారాయినిపల్లికి చెందిన యువతి అదేగ్రామానికి చెందిన శివ అనే యువకుడు కొంతకాలం ప్రేమించుకుంటున్నారు. ఇటీవల యువతి మరొకరితో వివాహానికి సిద్ధం కావడంతో శివ జీర్ణించుకోలేకపోయాడు. సోమవారం హాస్పటల్‌కు వెళ్తున్న యువతి వెంట వెళ్లిన అతడు మార్గమధ్యలో ఆమె దాడి చేశాడు.

తీవ్ర రక్తస్రావమై అసస్మారక స్థితికి చేరగా చనిపోయిందని భావించి గ్రామానికి చేరుకున్నాడు.  అనంతరం ఆత్మహత్య చేసుకునేందుకు మంచినీటి ట్యాంకుపై నుంచి దూకాడు. తీవ్రంగా గాయపడిన శివ హైదరాబాద్‌లోని   ప్రైవేట్‌ దవాఖానలో చికిత్స పొందుతున్నాడు. గాయపడిన యువతి ప్రస్తుతం మర్రిగూడ దవాఖానలో చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo