శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Crime - Jul 08, 2020 , 15:49:31

వ్యభిచార గృహంపై దాడి.. ఇద్దరు విటులు అరెస్ట్‌

వ్యభిచార గృహంపై దాడి.. ఇద్దరు విటులు అరెస్ట్‌

బెంగళూరు  : బెంగళూరులోని యశ్వంత్‌పూర్ ప్రాంతంలో గల ఓ అతిథి గృహంలో వ్యభిచారం నిర్వహిస్తున్నారన్న సమాచారం మేరకు బుధవారం సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (సీసీబీ) దాడి చేసింది. సెక్స్‌ రాకెట్‌ను చేధించడంతో పాటు ఇద్దరు విటులను అరెస్టు చేశారు. ఇందులో ఐదుగురు మహిళలను రక్షించినట్లు జాయింట్ పోలీస్ కమిషనర్ (క్రైమ్) సందీప్ పాటిల్ తెలిపారు. అమాయక మహిళలను తీసుకొచ్చి వ్యభిచార రొంపిలోకి దించి వారి జీవితాలను నాశనం చేయాలని చూస్తే కఠిన చర్యలుంటాయని ఆయన హెచ్చరించారు. అయితే గతవారం కూడా ఇదే విధంగా సీసీబీ వ్యభిచార గృహంపై దాడులు చేసింది. ఈ ఘటనలో 27 మంది మహిళలున్నారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo