శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Crime - Jul 21, 2020 , 16:39:04

కూతుళ్ల ఎదుటే జర్నలిస్టుపై దాడి

కూతుళ్ల ఎదుటే జర్నలిస్టుపై దాడి

ఢిల్లీ : ఢిల్లీ సమీపంలోని ఘజియాబాద్‌లో ఒక జర్నలిస్టుపై సోమవారం రాత్రి కాల్పులు జరిగాయి. సీసీటీవీ ఫుటేజీ ప్రకారం నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఘజియాబాద్‌లోని విజయ్‌నగర్‌ ప్రాంతంలో రహదారిపై ఈ దాడి జరుగ్గా సీసీ ఫుటేజిలో రికార్డు అయ్యింది. 

విక్రమ్ జోషి అనే జర్నలిస్టు తన ఇద్దరు కుమార్తెలతో ద్విచక్రవాహనంపై వెళ్తుండగా కొందరు వ్యక్తులు ఒక్కసారిగా దాడి చేయడంతో బైక్‌ అదుపుతప్పి కిందపడింది. దీంతో ఓ ఐదారుగురు వ్యక్తులు బైక్‌ను చుట్టుముట్టి జోషిపై విచక్షణారహితంగా దాడికి దిగారు. ఈ సమయంలో జోషి ఇద్దరు కూతుళ్లు అక్కడి నుంచి పరిగెత్తారు. జర్నలిస్టుపై దాడి చేస్తూ ఒక్కసారిగా కాల్పులు జరిపి నిందితులు అక్కడి నుంచి పారిపోయారు. తీవ్ర గాయాలతో పడిపోయిన జోషి వద్దకు అతడి పెద్ద కుమార్తె వచ్చి రోధిస్తూ సాయం కోసం అర్ధించగా ఇద్దరు వ్యక్తులు వచ్చి జోషిని దవాఖానకు తరలించారు. పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలియజేశారు. 

సోమవారం రాత్రి తన సోదరి ఇంటికి వెళ్లి తిరిగి వస్తుండగా 10:30 సమయంలో ఈ ఘటన చోటుచేసుకుందని, జోషి సోదరుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని సీనియర్ పోలీస్‌ అధికారి కలానిధి నైతాని చెప్పారు. జోషి మేనకోడలు తరపు బంధువులు ఈ దాటికి పాల్పడ్డారని కుటుంబ సభ్యులు, పోలీసులు అనుమానిస్తున్నారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo