ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Crime - Jul 29, 2020 , 09:45:40

విశాఖలో దారుణం.. కూతురిపై ఆరు నెలలుగా అత్యాచారం

విశాఖలో దారుణం.. కూతురిపై ఆరు నెలలుగా అత్యాచారం

విశాఖపట్నం: సభ్యసమాజం తలదించుకునేలా విశాఖలో దారుణం చోటుచేసుకుంది. రక్షణగా ఉండవలసిన తండ్రే కన్నకూతురిపై అత్యాచారం చేసిన సంఘటన విశాఖపట్నం రైల్వే నూతన కాలనీలో జరిగింది. భాస్కర్‌రావు అనే వ్యక్తి తన 14 ఏళ్ల కూతురును గత ఆరు నెలలుగా బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. కూతురుకు కడుపునొప్పి రావడంతో ఆమెను కుటుంబ సభ్యులు కేజీహెచ్‌కు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ పరీక్షించిన వైద్యులు ఆమె గర్భవతిగా నిర్ధారణ కావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. గత నాలుగేళ్ల క్రితం భార్య మరణించడంతో భాస్కర్‌రావు తల్లిదండ్రుల వద్ద ఉంటున్నాడు. భాస్కర్‌రావును నాలుగో టౌన్‌ పోలీసులు అదుపులోకి తీసుకుని అతడిపై పోక్సో చట్టం, పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo