శనివారం 19 సెప్టెంబర్ 2020
Crime - Jul 08, 2020 , 11:53:29

ప్రొక్లెయినర్‌ కొక్కెంతో వ్యక్తి తలపై దాడి.. వీడియో

ప్రొక్లెయినర్‌ కొక్కెంతో వ్యక్తి తలపై దాడి.. వీడియో

ములుగు : ప్రొక్లెయినర్‌ డ్రైవర్‌, మరోవ్యక్తి మధ్య వాగ్వాదం జరగ్గా కొక్కెంతో వ్యక్తి తలపై దాడిచేయడంతో తీవ్ర గాయాలపాలైన సంఘటన మంగళవారం ములుగు జిల్లా మంగ్‌పెడలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. మంగ్‌పెడలోని ఓ ఖాళీ ప్రదేశంలో హిమాచల్‌ అనే వ్యక్తి ప్రొక్లెయినర్‌తో మట్టి చదును చేస్తున్నాడు. అదే సమయంలో మంగ్‌పెడ గ్రామానికి చెందిన సూరయ్య మద్యం సేవించి అక్కడికి చేరుకొని ఏం పని చేస్తున్నావ్‌ అని ప్రొక్లెయినర్‌ డ్రైవర్‌ను అడిగాడు. దీంతో హిమాచల్‌ అవమానకర భాషలో సమాధానం ఇచ్చాడు. ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి వాగ్వాదానికి దారి తీసింది. ఈ సమయంలో వాహనంలో ఉన్న హిమాచల్‌ ప్రొక్లెయినర్‌ కొక్కెంతో సూరయ్య తలపై దాడి చేశాడు. బాధితుడి కుమారుడు ఫిర్యాదు మేరుకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వెంకటేశ్వర్‌రావు తెలిపారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డోన్‌లోడ్ చేసుకోండి.


logo