గురువారం 01 అక్టోబర్ 2020
Crime - Sep 15, 2020 , 18:29:48

రూ. 2 కోట్ల విలువైన బ్రౌన్‌ షుగర్‌ స్వాధీనం.. ఇద్దరి అరెస్టు

రూ. 2 కోట్ల విలువైన  బ్రౌన్‌ షుగర్‌ స్వాధీనం.. ఇద్దరి అరెస్టు

చందేల్ : మణిపూర్‌లోని చందేల్ జిల్లాలో అక్రమంగా వాహనంలో తరలిస్తున్న కిలో బ్రౌన్‌ షుగర్‌ను అస్సాం రైఫిల్స్‌ స్వాధీనం చేసుకున్నారు. సరిహద్దులోని ఖూడెంగ్తాబి గ్రామం వద్ద చేపట్టిన తనిఖీల్లో అనుమానాస్పదంగా వెళ్తున్న కారును నిలిపి పరిశీలించారు. బ్రౌన్‌ షుగర్‌ కనిపించడంతో స్వాధీనం చేసుకొని ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో దీని విలువ రూ .2.14 కోట్లకు పైగా ఉంటుందని ఉన్నతాధికారులు తెలిపారు. మోరే నుంచి ఇంఫాల్‌కు బ్రౌన్‌ షుగర్‌ను తీసుకెళ్తున్నట్లు గుర్తించారు. కారును, బ్రౌన్‌ షుగర్‌ను సీజ్‌ చేసి తదుపరి దర్యాప్తు కోసం మోరే పోలీసులకు అప్పగించామని అస్సాం రైఫిల్స్ ఇన్‌స్పెక్టర్‌ తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo