సోమవారం 28 సెప్టెంబర్ 2020
Crime - Sep 06, 2020 , 11:13:21

ప‌ని అబ్బాయిపై వేడి నీళ్లు పోసి చిత్ర‌హింస‌లు

ప‌ని అబ్బాయిపై వేడి నీళ్లు పోసి చిత్ర‌హింస‌లు

గువ‌హ‌టి : మ‌ద్యం మ‌త్తులో ఉన్న ఓ డాక్ట‌ర్ త‌న ఇంట్లో ప‌ని చేసే అబ్బాయిపై వేడి నీళ్లు పోసి చిత్ర‌హింస‌ల‌కు గురి చేసి క‌ట‌క‌ట‌లాపాల‌య్యాడు. ఈ ఘ‌ట‌న అసోంలోని దిబ్రుఘ‌ర్‌లో ఆగ‌స్టు 29న చోటు చేసుకోగా ఆల‌స్యంగా వెలుగు చూసింది. 

దిబ్రుఘ‌ర్‌లోని అసోం మెడిక‌ల్ కాలేజీ ఆస్ప‌త్రిలో సిద్ధి ప్ర‌సాద్ దేయూరి అనే డాక్ట‌ర్ ప‌ని చేస్తున్నాడు. అత‌ని భార్య మిథాలి కోన్వార్ మోరాన్ కాలేజీ ప్రిన్సిపాల్‌గా విధులు నిర్వ‌ర్తిస్తోంది. అయితే వీరి ఇంట్లో ఓ 12 ఏళ్ల అబ్బాయి ప‌నోడిగా ఉన్నాడు. ఆ బాలుడు నిద్రిస్తున్న స‌మ‌యంలో డాక్ట‌ర్‌.. అత‌నిపై వేడి నీళ్లు పోసి వేధించాడు. ఈ విష‌యం బాల‌ల సంక్షేమ క‌మిటీకి తెలిసింది. దీంతో వారు విచార‌ణ జ‌రిపి దంప‌తుల‌ను అరెస్టు చేశారు. బాలుడిని చికిత్స నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.    

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo